
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయా? లబ్ధిదారుల్లో అక్రమార్కులున్నా రా? అనేది తేల్చేందుకు సిద్ధమవుతోంది గిరిజన సంక్షేమ శాఖ. పథకాలు దారితప్పకుండా, పక్కా గా అర్హులకు చేర్చాలనే లక్ష్యంతో దీనికి ఉపక్రమిస్తోంది. ఈ శాఖ ద్వారా ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అర్హతలు నిర్ధారించిన తర్వాత ఫలాలు పంపిణీ చేస్తున్నప్పటికీ... వారంతా అర్హతలున్నవారేనా? కాదా? అనే కోణంలో పరిశీలించనున్నారు. రెండ్రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
పునఃపరిశీలన ఎలా చేపట్టాలనే దానిపై స్పష్టతకు రావాలని ఆమె సూచించడంతో అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 76 రకాల సం క్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తున్నారు. ఇందులో విద్య, వైద్యం, ఆర్థిక చే యూత, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అమలు చేస్తున్న వాటి ల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమాలున్నా యి. ఇందులో అధిక నిధులు ఖర్చు చేస్తున్న పథకాలపై పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించారు. ఆర్థిక చేయూత కార్యక్రమాల్లో లబ్ధిదారుల స్థితిని తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఆర్థిక చేయూత పథకాల్లో పరిశీలన చేసే అవకాశం ఉండగా... ఇం దులో అనర్హులుగా తేలితే వేటు వేయాలని నిర్ణ యించారు. అలాగే, దుర్వినియోగమైన మొత్తాన్ని రికవరీ చేయాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment