తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్ గురుకులానికి చెందిన అశోక్‌నగర్(వరంగల్ రూరల్), రుక్మాపూర్ (కరీంగనగర్)లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, ఉమెన్ (టీటీడబ్ల్యూఆర్‌ఏఎఫ్‌పీడీసీ).. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 46
► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్.
► సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, హిందీ తదితరాలు.
అర్హత:
► టీజీటీ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.
► ఆర్ట్ టీచర్ పోస్టులకి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
► కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఎంసీఏ/బీటెక్ (కంప్యూటర్స్) ఉత్తీర్ణులవ్వాలి.
► కౌన్సిలర్ పోస్టులకు సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
► పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్/టెట్ అర్హత సాధించి ఉండాలి.
► వేతనం: టీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.30,000, పీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.40,000, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్ పోస్టులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2021
► వెబ్‌సైట్: https://tswreis.in/
https://tgtwgurukulam.telangana.gov.in/
కిట్స్, వరంగల్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి చెందిన అటానమస్ ఇన్‌స్టిట్యూట్ కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్).. వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► పోస్టులు: ప్రిన్సిపల్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
► విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీ రింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరిం గ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. మాస్టర్స్ అభ్యర్థులకు నెట్/స్లేట్/సెట్ అర్హతతోపాటు టీచింగ్/ పరిశోధనలో అనుభవం ఉండాలి.
► ఎంపిక విధానం: అకడమిక్ విజయాలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్–506015 చిరునామకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 06.07.2021
► వెబ్‌సైట్: www.kitsw.ac.in
మరిన్ని నోటిఫికేషన్లు:
అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment