India Post Telangana Gramin Dak Sevak Posts Recruitment 2021 - Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌; తపాలాశాఖలో ఉద్యోగాలు

Published Wed, Feb 10 2021 6:48 PM | Last Updated on Thu, Feb 11 2021 8:59 AM

Gramin Dak Sevak Telangana Recruitment 2021, Full Details - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కొత్త తపాలా కార్యాలయాల ఏర్పాటును దాదాపు పక్కన పెట్టిన తపాలాశాఖ, ఉన్నవాటిల్లో కొత్త ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తోంది. తపాలా కార్యాలయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్యో గులతో సేవలు అందించనుంది. అలాగే, పోస్టాఫీసులు ఉన్న ప్రాంతాల్లో కూడా, పని భారం పెరిగితే దాన్ని తాత్కాలిక ఉద్యోగులతో నిర్వహించనుంది. ఈ మేరకు తాత్కాలిక పద్ధతిలో 1,150 ఉద్యోగాల భర్తీకి తాజాగా తపాలాశాఖ తెలంగాణ సర్కిల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పేరుతో ఉద్యోగులను నియమించుకోనుంది. కాస్త పనిభారం ఉండే చోట గరిష్టంగా 5 గంటలు, లేనిచోట అంత కంటే తక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. 

ఎక్కడైనా పోస్టాఫీసు అందుబాటులో లేని చోట పూర్తి వ్యవహారాలు చూసుకునే వారిని బ్రాంచి పోస్టుమాస్టర్‌గా పిలుస్తారు. బ్రాంచి పోస్టుమాస్టర్‌కు సంబంధించి 5 గంటలు పనిచేస్తే రూ.14,500, 4 గంటలు పనిచేస్తే రూ.12 వేలు నెల వేతనంగా చెల్లిస్తారు. అలాగే అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్, డాక్‌ సేవక్‌ పోస్టులకు సంబంధించి ఆ మొత్తం రూ.12 వేలు, రూ.10 వేలుగా ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు (వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తపాలాశాఖ వెబ్‌సైట్‌(http://www.appost.in/gdsonline)లో సంప్రదించాలి.

చదవండి:
బెల్‌లో 16 ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement