Gramin Dak Sevak
-
ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్డేట్ సేవలు
ఆధార్ కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ఆధార్ హోల్డర్ తన ఇంటి వద్దనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ లో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేయడానికి కొత్త సేవలను ప్రారంభించినట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) నేడు(జూలై 20) ప్రకటించింది. ఆధార్ హోల్డర్ ఇంటి వద్దే మొబైల్ నంబర్ ను పోస్ట్ మాన్ ఆధార్ లో అప్డేట్ చేయనున్నట్లు ఐపిపీబి ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 650 ఐపిపీబి బ్రాంచీలు, 1,46,000 పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవక్ ల ద్వారా ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం, ఐపీపీబి మొబైల్ అప్డేట్ సేవలను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలోనే ఐపీపీబి నెట్ వర్క్ ద్వారా పిల్లల నమోదు సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ తో పాటు, పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవకులు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. "ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి యుఐడీఎఐ తన నిరంతర ప్రయత్నంలో భాగంగా పోస్ట్ మాన్, గ్రామీణ్ డాక్ సేవకుల ద్వారా నివాసితుల ఇంటి వద్దే మొబైల్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనేక యుఐడీఎఐ ఆన్ లైన్ అప్ డేట్ సదుపాయాలతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు" అని యుఐడీఎఐ సిఈఓ సౌరభ్ గార్గ్ తెలిపారు. Now a resident Aadhaar holder can get his mobile number updated in Aadhaar by the postman at his door step. 👉👉@IPPBOnline launched today a service for updating mobile number in Aadhaar as a Registrar for @UIDAI . pic.twitter.com/TGjiGhHPeG — PIB_INDIA Ministry of Communications (@pib_comm) July 20, 2021 -
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: కొత్త తపాలా కార్యాలయాల ఏర్పాటును దాదాపు పక్కన పెట్టిన తపాలాశాఖ, ఉన్నవాటిల్లో కొత్త ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తోంది. తపాలా కార్యాలయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో తాత్కాలిక ఉద్యో గులతో సేవలు అందించనుంది. అలాగే, పోస్టాఫీసులు ఉన్న ప్రాంతాల్లో కూడా, పని భారం పెరిగితే దాన్ని తాత్కాలిక ఉద్యోగులతో నిర్వహించనుంది. ఈ మేరకు తాత్కాలిక పద్ధతిలో 1,150 ఉద్యోగాల భర్తీకి తాజాగా తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ పేరుతో ఉద్యోగులను నియమించుకోనుంది. కాస్త పనిభారం ఉండే చోట గరిష్టంగా 5 గంటలు, లేనిచోట అంత కంటే తక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా పోస్టాఫీసు అందుబాటులో లేని చోట పూర్తి వ్యవహారాలు చూసుకునే వారిని బ్రాంచి పోస్టుమాస్టర్‌గా పిలుస్తారు. బ్రాంచి పోస్టుమాస్టర్‌కు సంబంధించి 5 గంటలు పనిచేస్తే రూ.14,500, 4 గంటలు పనిచేస్తే రూ.12 వేలు నెల వేతనంగా చెల్లిస్తారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి ఆ మొత్తం రూ.12 వేలు, రూ.10 వేలుగా ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు (వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తపాలాశాఖ వెబ్సైట్(http://www.appost.in/gdsonline)లో సంప్రదించాలి. చదవండి: బెల్లో 16 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు