![Telangana: ST Study Circle Offer Free Coaching For IBPS Exams - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/13/IBPS_0.jpg.webp?itok=Umto9otG)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన స్టడీ సర్కిల్‌లో ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు సముజ్వల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థుల అర్హతలో మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని, మొత్తం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించామన్నారు. వివరాలకు 6303497606 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment