కోల్‌కతా: జూనియర్ డాక్టర్ మరణంపై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలని సూచించింది.
జూనియర్ డాక్టర్ మరణంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బాధితురాలు తల్లిదండ్రులుతో పాటు పలువురు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ (ఆగస్ట్ 13 న) చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థిని అత్యాచారం, హత్యపై సందీష్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశంపై సందీష్ ఘోష్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆయన తీరుపై మండిపడింది.
డాక్టర్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. విద్యార్ధులు, ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కానీ సందీష్ ఘోష్ ఎలాంటి స‍్పందన లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది.
ఈ సందర్భంగా ‘ఆర్‌జీ కార్ కాలేజీ విద్యార్ధులకు ప్రిన్సిపల్ సంరక్షకుడు .. అతను సానుభూతి చూపకపోతే ఎవరు చూపిస్తారు? ఆయన ఎక్కడా పని చేయకుండా ఇంట్లోనే ఉండాలి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం వ్యాఖ్యానించారు.
ఏ వ్యక్తి చట్టానికి అతీతులు కారు. మధ్యాహ్నం 2 గంటలలోపు డాక్టర్ ఘోష్ రాజీనామా లేఖను కోర్టుకు అందజేయాలి. ఆ లేఖలో ఘోష్ ఏం రాశారో మేం చదవాలని అనుకుంటున్నామని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment