high court bar association
-
ట్రైనీ డాక్టర్ కేసు.. ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపల్‌పై కోల్‌కతా హైకోర్ట్ ఆగ్రహం
కోల్‌కతా: జూనియర్ డాక్టర్ మరణంపై కోల్‌కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలని సూచించింది. జూనియర్ డాక్టర్ మరణంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బాధితురాలు తల్లిదండ్రులుతో పాటు పలువురు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ (ఆగస్ట్ 13 న) చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థిని అత్యాచారం, హత్యపై సందీష్ ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్జీకార్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశంపై సందీష్ ఘోష్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆయన తీరుపై మండిపడింది. డాక్టర్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. విద్యార్ధులు, ఆమె తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కానీ సందీష్ ఘోష్ ఎలాంటి స్పందన లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. ఈ సందర్భంగా ‘ఆర్జీ కార్ కాలేజీ విద్యార్ధులకు ప్రిన్సిపల్ సంరక్షకుడు .. అతను సానుభూతి చూపకపోతే ఎవరు చూపిస్తారు? ఆయన ఎక్కడా పని చేయకుండా ఇంట్లోనే ఉండాలి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం వ్యాఖ్యానించారు. ఏ వ్యక్తి చట్టానికి అతీతులు కారు. మధ్యాహ్నం 2 గంటలలోపు డాక్టర్ ఘోష్ రాజీనామా లేఖను కోర్టుకు అందజేయాలి. ఆ లేఖలో ఘోష్ ఏం రాశారో మేం చదవాలని అనుకుంటున్నామని ఆదేశాలు జారీ చేశారు. -
షాహీ ఈద్గా మసీదు సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
లక్నో: కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు -
జస్టిస్ సామ్ కోషి ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సామ్ కోషి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉద యం 10 గంటలకు హైకోర్టు మొదటి హాల్లో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తు న్న జస్టిస్ సామ్ కోషిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జస్టిస్ సామ్ కోషి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో నా సీనియర్‌గా జస్టిస్ అరాధే కొత్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సామ్ కోషిని హైకోర్టు బార్ అసోసియేషన్ సన్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ కోషి మాట్లాడుతూ.. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు తన సీనియర్ న్యాయవాదిగా జస్టిస్ అలోక్ అరాధే ఉన్నారని, మళ్లీ ఆయన సీజేగా ఉన్న తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు మంచి పేరు ఉందని, దాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనతో న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్ సామ్ కోషి.. తెలంగాణ హైకోర్టుకు రావడం ఆనందంగా ఉందని సీజే జస్టిస్ అరాధే పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, వైస్ చైర్మన్ కల్యాణ్‌రావు చెంగల్వ పాల్గొన్నారు. అనంతరం సీజేతోపాటు న్యాయ మూర్తులు బార్ అసోసియేషన్‌ను సందర్శించారు. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె.జానకీరామిరెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి ఉప్పుటూరు వేణుగోపాలరావుపై 20 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రతి రౌండ్లో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం జానకీరామిరెడ్డిని వరించింది. మొత్తం 1,438 ఓట్లు పోల్ కాగా.. జానకీరామిరెడ్డికి 703, వేణుగోపాలరావుకు 683, మరో అభ్యర్థి డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబుకు 38 ఓట్లు వచ్చాయి. కొన్ని ఓట్లు చెల్లలేదు. వేణుగోపాలరావు విజయావకాశాలను ప్రసాద్‌బాబు ప్రభావితం చేశారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి గెలుపొందడం ఇది వరుసగా రెండోసారి. ఇప్పటి వరకు సంఘం చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి ఎవరూ లేరు. కాగా ఉపాధ్యక్షుడిగా పీఎస్పీ సురేష్‌కుమార్ గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి తుహిన్ కుమార్‌పై 52 ఓట్ల తేడాతో గెలిచారు. సురేష్‌కు 739 ఓట్లు రాగా తుహిన్కు 687 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా వి.సాయికుమార్ ఎన్నికయ్యారు. ఆయన టి.సింగయ్య గౌడ్‌పై 142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంయుక్త కార్యదర్శిగా సాల్మన్ రాజు గెలుపొందారు. ఆయన వై.సోమరాజుపై 56 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కోశాధికారిగా బీవీ అపర్ణలక్ష్మి 75 ఓట్లతో, గ్రంథాలయ కార్యదర్శిగా జ్ఞానేశ్వరరావు 4 ఓట్లతో, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా చంద్రశేఖర్‌రెడ్డి పితాని 213 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా అన్నం శ్రీధర్, మారుతి విద్యాసాగర్, కాశీ అన్నపూర్ణ, షేక్ ఆసిఫ్, శాంతికిరణ్, శరత్, అచ్యుతరామయ్య విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విజయ్‌కుమార్ వ్యవహరించారు. ఎన్నికల్లో జానకీరామిరెడ్డి వర్గం ఓవైపు నిలవగా, ఆయన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఏకమయ్యాయి. -
రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం
డిసెంబర్లో ఎన్నికలకు అవకాశం... ప్రస్తుత కార్యవర్గం రాజీనామా సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇకపై రెండుగా విడిపోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో ఇదే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. సమావేశానికి హాజరైన న్యాయవాదుల్లో అత్యధికులు సంఘాన్ని విభజించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ మేరకు తీర్మానం చేశారు. ఇరు రాష్ట్రాలకూ న్యాయవాదుల సంఘాలు ఏర్పాటయ్యాక వాటికి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంఘం ప్రస్తుత కార్యవర్గం రాజీనామా చేసింది. అధ్యక్షుడు గిరిధరరావు తమ రాజీనామాలను ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్స్‌కు సమర్పించారు. దీంతో న్యాయవాదుల సంఘం వ్యవహారాలను ఇకపై వీరిద్దరూ నిర్వహించాల్సి ఉంటుంది. అలా నిర్వహించలేనిపక్షంలో.. ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముంది.