రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం | high court bar association split into many parts | Sakshi
Sakshi News home page

రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం

Published Sat, Nov 15 2014 1:05 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM

రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం - Sakshi

రెండు కానున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం

డిసెంబర్‌లో ఎన్నికలకు అవకాశం... ప్రస్తుత కార్యవర్గం రాజీనామా
 సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇకపై రెండుగా విడిపోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో ఇదే అంశంపై తీవ్ర చర్చ జరిగింది. సమావేశానికి హాజరైన న్యాయవాదుల్లో అత్యధికులు సంఘాన్ని విభజించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ మేరకు తీర్మానం చేశారు.

ఇరు రాష్ట్రాలకూ న్యాయవాదుల సంఘాలు ఏర్పాటయ్యాక వాటికి డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంఘం ప్రస్తుత కార్యవర్గం రాజీనామా చేసింది. అధ్యక్షుడు గిరిధరరావు తమ రాజీనామాలను ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్స్‌కు సమర్పించారు. దీంతో న్యాయవాదుల సంఘం వ్యవహారాలను ఇకపై వీరిద్దరూ నిర్వహించాల్సి ఉంటుంది. అలా నిర్వహించలేనిపక్షంలో.. ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement