
ప్రస్తుతం గైనకాలజీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గానీ పూర్వం రోజుల్లో ఇవి లేక మహిళలు చాలా ఇబ్బందిపడేవారు. తమ సమస్యలను మరొకరితో చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడేవారు. అలాంటి పరిస్థితుల్లో వారుపడే అంతర్గత గైనకాలజీ సమస్యలు చికిత్స లేనివిగా ఉండేవి. ఆ దిశగా ప్రయోగాలు చేసేవాళ్లు కూడా తక్కువే. అందులోనూ స్త్రీ శరీర ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిపై ధైర్యంగా ప్రయోగాలు చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి జేమ్స్ మారియన్ సిమ్స్. అతని వల్లే స్త్రీల ప్రసూతి సమస్యలకు నివారణోపాయాలు కనిపెట్టడానికి మార్గం సుగమమైంది. ఆ నేపథ్యంలో అతడు ఒడిగట్టిన దారుణలు తెలిస్తే వామ్మో అని విస్తుపోతారు.
'గైనాకాలజీ' అనే అంశం వస్తే అతడికే ధన్యవాదాలు చెప్పుకొవాలి. అంతేగాదు అతడిని "ఆధునిక గైనకాలజీ పితామహుడు"గా అభివర్ణిస్తారు కూడా. అయితే ఈ గైనకాలజీ సమస్యలను నివారించే క్రమంలో అతడు చేసిన దారుణ ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు.
గైనకాలజీ నిపుణులు జేమ్స్ మారియన్ సిమ్స్ 1813లో అమెరికా సౌత్ కరోలినాలోని లాంకాస్టర్ కౌంటీలో జన్మించాడు. అతడు జెఫెర్సన్ మెడికల్ కాలేజీలో మూడు నెలల కోర్సు పూర్తి చేసుకుని ఒక వైద్యుడి వద్ద ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సాధారణంగా కొన్నేళ్లు హౌస్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తారు.
అయితే ఆ కాలంలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేయకుండానే నేరుగా వైద్య వృత్తిని కొనసాగించేవారు. ఆ నేపథ్యంలోనే ఆయన వల్ల ఇద్దరు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత జేమ్స్ అలబామాలోని మోంట్‌గోమెరీకి మకాం మార్చాడు. అక్కడ జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో వైద్య మానవీయ శాస్త్రాల ప్రొఫెసర్ వెనెస్సా గాంబుల్ ఆధ్వర్యంలో డాక్టర్‌గా పనిచేసేవాడు.
అక్కడ ఉండే ఎనిమిది మంది వ్యక్తుల ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించేవాడు. కొందరిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిపై ప్రయోగాలు చేసేవాడు. అయితే ఆరోజుల్లో మహిళల ప్రసూతికి సబంధించిన సమస్యలను పరిశీలించడానకి సరైన పరికరాలు ఉండేవి కాదు. దీంతో వారి సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రత్యత్పత్తి అవయవాల్లోకి వేళ్లను చొప్పించి గానీ తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు.
అలాగే వారికి చికిత్స చేసేందుకు అనువైన బెడ్ కూడా ఉండేది కాదు. అవమానీయ పద్ధతుల్లో మహిళలకు ట్రీట్‌మెంట్ చేయకతప్పని పరిస్థితి అంటూ జేమ్స్ తన ఆత్మకథకు సంబంధించిన పుస్తకంలో రాశారు. ఆ క్రమంలో కొందరి పేషెంట్ల పరిస్థితి రీత్యా తన వ్యక్తిగత కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం కోసం ప్రయోగాలు చేసేవాడట.
అందుకోసం అతడు నల్లజాతి పేషెంట్లనే వినయోగించానని ఆ పుస్తకంలో తెలిపాడు. అందరు అనుకున్నట్లు నల్లజాతీయల శరీరాలు మందంగా ఉంటాయి కాబట్టి బాధ తక్కువగా ఉంటుందనేది అపోహేనని పేర్కొన్నాడు. తాను వారిపై అనస్థీషియా ఇవ్వకుండానే ప్రయోగాలు చేసేవాడినని, ఎందుకంటే సమస్యను, స్త్రీ దేహ నిర్మాణాన్ని అర్థంచేసుకునేందుకు అలా చేయక తప్పేది కాదని పుస్తకంలో చెప్పుకొచ్చాడు.
ఆ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన ఒక రోగి కేసు గైనకాలజీ సమస్యను పరిష్కరించడానకి దారతీసిందని తెలిపాడు. ఒకామెకు ఫిస్టులా సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకు మూత్రం తెలియకుండానే వెళ్లిపోతుంది. అందుకు చికిత్స లేదని తెలిసి ఆమెపై పలు ప్రయోగాలు చేశానని, ఆ విధంగానే మహిళల ప్రసూతి సమస్యలకు నివారణ మార్గాలను కనిపెట్టగలిగానని తన తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్‌లో రాసుకొచ్చాడు.
తాను చేసిన ప్రయోగాలు చాలామంది మహిళలను బాధపెట్టి ఉండొచ్చు గానీ, వాళ్లంతా ఎదుర్కొనే గైనకాలజీ సమస్యలను నివారించడానికి మార్గం సుగమమైందని ఆ పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ కేవలం నల్లజాతీయుల మహిళలపై ప్రయోగాలు చేయడం అనేది చూస్తే జేమ్స్‌కి ఉన్న జాత్యాహంకారం తేటతెల్లమవ్వగా, మరోవైపు ఆ నల్లజాతీయ మహిళలను యావత్తు స్త్రీల సమస్యలకు నివారించడంలో సహాయపడిన వారిగా కీర్తించవచ్చు కూడా కదూ..!.
(చదవండి: మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment