హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) చార్లీస్ హార్ట్ హీరోస్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో తొలి రోజు నలుగురు చిన్నారులకు ఉచితంగా గుండె సంబందిత శస్త్ర చికిత్సలు చేశారు. సోమవారం లండన్‌కు చెందిన గుండె వైద్యనిపుణులు డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలో నిమ్స్ కార్డియా థొరాసిక్ సర్జరీ విభాగం వైద్యులు నీలోఫర్ వైద్యులతో కలిసి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన లింగాల అవని(04), చత్తీస్‌ఘడ్‌కు చెందిన నిత్య(03), భువనగిరికి చెందిన యోగేష్(07), సిరిసిల్లకు చెందిన లక్ష్మీ ప్రసన్న(07)లకు ఆపరేషన్లు చేశారు. అనంతరం వారిని వార్డుకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నిరుపేద చిన్నారుల ప్రాధాన్యత క్రమంలో శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు నిమ్స్ కార్డియా థోరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడి డాక్టర్ ఎం. అమరేష్‌రావు అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మరో ముగ్గురికి గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment