![రాచకొండలో ఆపరేషన్ స్మైల్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/operation_mr-1738894395-0.jpg.webp?itok=e7EiDpsm)
రాచకొండలో ఆపరేషన్ స్మైల్
సాక్షి, సిటీబ్యూరో: హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,051 మంది బాల కార్మికులకు రాచకొండ పోలీసులు విముక్తి కలిగించారు. ఆపరేషన్ స్మైల్–11లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, షీ టీమ్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలతో పాటు ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లు (ఒక మహిళా కానిస్టేబుల్ కలిపి)లతో 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కొనసాగింది. విముక్తి కలిగించిన చిన్నారుల్లో మన రాష్ట్రానికి చెందిన బాలురు 512 మంది, బాలికలు 28 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలురు 473 మంది, బాలికలు 38 మంది ఉన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న 464 మంది యాజమానులపై ఎఫ్‌ఐఆర్‌లు, 410 మందిపై జీడీ ఎంట్రీ కేసులు నమోదు చేశారు.
1,051 మంది చిన్నారులకు విముక్తి
Comments
Please login to add a commentAdd a comment