సాక్షి, హైదరాబాద్ : ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో ఆమెకు ఉచితంగా వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. కాగా కరోనా లక్షణాలతో డాక్టర్ సుల్తానా నిన్న (శనివారం) చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పేరుతో తుంబే ఆస్పత్రి యాజమాన్యం 24 గంటలకు రూ.లక్షా 15 వేలు బిల్లు వేసింది. దీంతో బిల్లు ఎక్కువ వేశారని ప్రశ్నించినందుకు డాక్టర్ సుల్తానాను తుంబే యాజమాన్యం నిర్బంధించింది. కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్‌గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. (చదవండి : దారుణం: బిల్లులపై ప్రశ్నించిన డాక్టర్ నిర్బంధం)
Comments
Please login to add a commentAdd a comment