గుండె జబ్బుతో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ఓ నిరుపేద యువతి నిమ్స్ జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకుంది.
పంజగుట్ట (హైదరాబాద్): గుండె జబ్బుతో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ఓ నిరుపేద యువతి నిమ్స్ జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శ్రీరామ్‌పూర్‌కు చెందిన ఆర్ జ్యోతి (23) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇటీవల నిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా గుండె మార్పిడి చేయాల్సిన అవసరముందని వైద్యులు సూచించారు.
దీంతో నిమ్స్ జీవన్‌దాన్ పథకంలో గుండె దాత కోసం ఆమె దరఖాస్తు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో మృతి చెందారని, తనకు సాయం చేయాల్సిందిగా నిమ్స్ జివన్‌దాన్ ప్రతినిధి అనూరాధను వేడుకుంది. జ్యోతిని అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని అనురాధ తెలిపారు.