వైద్య విద్య బోధన, ఎమర్జెన్సీ సేవలు, లైబ్రరీ వంటి సదుపాయాల విషయంలో పరస్పరం సహకరించుకునేలా ఈఎస్‌ఐసీ సూపర్
దత్తాత్రేయ, లకా్ష్మరెడ్డి, నాయిని సమక్షంలో ఖరారు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య బోధన, ఎమర్జెన్సీ సేవలు, లైబ్రరీ వంటి సదుపాయాల విషయంలో పరస్పరం సహకరించుకునేలా ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలే జీ, నిమ్స్ ఆస్పత్రుల మధ్య అవగాహన కుది రింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి సమక్షంలో ఈఎస్‌ఐసీ, నిమ్స్ అధికారులు శనివారం ఒప్పందం చేసుకున్నారు.
దత్తాత్రేయ మాట్లాడుతూ... సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీని దేశంలోనే ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాను న్న మెడికల్ కాలేజీలో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే అందేట్లు చూస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది కార్మికులున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జర్నలిస్టులందరికీ ఈఎస్‌ఐ వైద్య సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మజీతియా కమిటీ సిఫారస్సు మేరకు జర్నలిస్టులకు వేజ్‌బోర్డు అమలయ్యేలా చూస్తామన్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమై దిశా నిర్ధేశం చేస్తామన్నారు.