Union labour minister Bandaru Dattatreya
-
గల్ఫ్ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ - విదేశాంగ మంత్రి సుష్మాతో భేటీ.. కార్మికుల ఇబ్బందులపై చర్చ ఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాద్రేయ శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల రక్షణకు సంబంధించిన పలు కీలక విషయాలను ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికుల వివరాలు సేకరిస్తున్నామని సుష్మాకు దత్తాత్రేయ తెలిపారు. ఏజెంట్ల మోసాలతో టూరిస్టు వీసాలపై వెళ్ళి చాలా మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని సుష్మా దృష్టికి తీసుకెళ్లినట్లు భేటీ అనంతరం మంత్రి దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. మోసం చేసే సంస్థలు, ఏజెంట్లపైనా దర్యాప్తు చేపట్టడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుష్మా హామీ ఇచ్చారని దత్తాత్రేయ వివరించారు. హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయ ఆధునీకరణపై సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి తెలిపారు. -
వెట్టి నిర్మూలనకు కఠిన చట్టాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెట్టిచాకిరీ నిర్మూలనకు కేంద్రం కృషి చేస్తోందని, ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరీ నిర్మూలన అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెట్టిచాకిరి బారినపడ్డ వారిని గుర్తించడానికి దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్ కేటాయించనున్నట్టు తెలిపారు. వెట్టిచాకిరీ నుంచి బాలలను విముక్తి చేసి 12వ తరగతి వరకు విద్యనందించి ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వెట్టిచాకిరీ కింద విముక్తి పొందిన అనాథ పిల్లలు, మహిళలు, వికలాంగులకు తక్షణ ఆర్థిక సాయం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్లకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. విముక్తి పొందిన ఒంటరి మహిళల వివాహ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. వంశీ కుటుంబాన్ని ఆదుకోండి.. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నల్లజాతీయుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వంశీరెడ్డి కుటుంబసభ్యులను ఆదుకోవాలని, వంశీరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలసి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ దోషిగా తేలడం వెనుక బీజేపీ పాత్ర ఏమీ లేదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని దత్తాత్రేయ అన్నారు. శశికళను దోషిగా తేల్చడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఉపాధి కూలీలకు వేసవి అలవెన్స్ : అదనంగా 30 శాతం భత్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు వేసవి అలవెన్స్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎండ వేడిమికి కూలీలలో పనిచేసే సామర్థ్యం తగ్గనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధిహామీ కూలీలకు రోజువారీ అందుతున్న వేతనానికి ఇకపై అదనంగా 20 నుంచి 30 శాతం వేసవి భత్యం అందనుంది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు వేసవి భత్యం ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున వేసవి అలవెన్స్‌ను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలివ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. -
ఆరు వినికిడి స్క్రీనింగ్ సెంటర్లు
హైదరాబాద్: పుట్టిన నెలలోపు పిల్లల్లో విని కిడి లోపాన్ని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఆరు అధునాతన వినికిడి స్క్రీనింగ్ సెంట ర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఇందులో ఒక సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఈఎన్టీ ఆస్పత్రికి మంజూరు చేసేందుకు తన వంతుగా కృషి చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటి వరకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను వివరిస్తూ.. దరఖాస్తు చేయాల్సిందిగా సంబంధిత అధికా రులను ఆదేశించారు. కోఠిలోని చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ)ఆసుపత్రి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ... ఈ సెంటర్ మంజూరైతే ఆస్పత్రికి కేంద్రం నుంచి రూ. వంద కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈఎన్టీ ఆస్పత్రి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడిం చిందని, ఇక్కడి ఖాళీ స్థలంలో నూతన భవనం నిర్మించాల్సిందిగా కోరుతూ కేసీఆర్‌కు లేఖ రాస్తానని తెలిపారు. ప్రధాని ఆశయం ప్రకా రం ఆస్పత్రిలోని రికార్డులు డిజిటలైజ్ కావాల న్నారు. సనత్‌నగర్‌లో రూ.200 కోట్లతో నిర్మించిన ఈఎస్ఐ వైద్య కళాశాలలో ఈఎన్టీ బ్లాక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జర్మనీ పౌరుడు తాను జర్మన్నని, జపాన్ పౌరుడు తాను జపనీయుడినని చెప్పు కుంటారు. కానీ మనదేశంలో మాత్రం తాను ఫలానా కులం వాడినని చెప్పుకుంటున్నారని, ఈ సంస్కృతి మారాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈఎన్టీ ఆస్పత్రి పూర్వ సూపరింటెండెంట్, ఆర్ఎంవోలకు ఆయన ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ అరుణా రామయ్య, ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెం డెంట్ శంకర్, ఉస్మానియా సూపరింటెండెంట్ వి.ఎస్. మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్, ‘ఈఎస్ఐసీ’ల మధ్య ఒప్పందం
దత్తాత్రేయ, లకా్ష్మరెడ్డి, నాయిని సమక్షంలో ఖరారు సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య బోధన, ఎమర్జెన్సీ సేవలు, లైబ్రరీ వంటి సదుపాయాల విషయంలో పరస్పరం సహకరించుకునేలా ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలే జీ, నిమ్స్ ఆస్పత్రుల మధ్య అవగాహన కుది రింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి సమక్షంలో ఈఎస్ఐసీ, నిమ్స్ అధికారులు శనివారం ఒప్పందం చేసుకున్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ... సనత్‌నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీని దేశంలోనే ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాను న్న మెడికల్ కాలేజీలో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే అందేట్లు చూస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది కార్మికులున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జర్నలిస్టులందరికీ ఈఎస్ఐ వైద్య సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మజీతియా కమిటీ సిఫారస్సు మేరకు జర్నలిస్టులకు వేజ్‌బోర్డు అమలయ్యేలా చూస్తామన్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమై దిశా నిర్ధేశం చేస్తామన్నారు. -
కార్మిక హక్కుల రక్షణే లక్ష్యం
సమగ్రాభివృద్ధికే ప్రధాని తపన కార్మికుల సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలు బండారు దత్తాత్రేయ వెల్లడి సాక్షి, హైదరాబాద్: కార్మిక హక్కులను పరిరక్షిస్తూ వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రదర్శన, అవగాహన కార్యక్రమంలో దత్తాత్రేయ ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ నినాదంతో .. వర్గం, ప్రాంతం అని తేడా లేకుండా దేశ సమగ్రాభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విధానాలు, పథకాల పట్ల ప్రజల్లో అవగాహనకు తొలుత ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇప్పుడు హైదరాబాద్‌లో తర్వాత లక్నో, పట్నా నగరాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్మిక శాఖలో చేపట్టిన మార్పు లు, ప్రవేశపెట్టిన పథకాలపై దత్తాత్రేయ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికులు దేశంలో దాదాపు 52 కోట్లకు పైగా ఉన్నారని, వారి సామాజిక భద్రత కోసం ప్రభుత్వం కార్మికులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. కార్మికుల సంక్షేమానికై చట్టాల్లో కొన్ని మార్పు లు తీసుకు రావాల్సిన అవసరం ఉందని, ఇది కార్మికులకు, పరిశ్రమల యాజమాన్యాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. అప్రెంటిస్ స్టైపెండ్ పెంపు గత ప్రభుత్వంలో ఏడాదికి అప్రెంటిస్ ద్వారా 2 లక్షల 80 వేల మందికి శిక్షణ ఇప్పించేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో వచ్చే రెండేళ్లలో ఏడాదికి 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నామని గతంలో ఇచ్చే స్టైపెండ్ రూ.2,400 నుంచి రూ.4,900కు పెంచుతున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులు ఏపీలో రూ.792 కోట్లు, తెలంగాణలో రూ. 190 కోట్లు ఉందని, ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి త్వరలో పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. అంతకు ముందు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్’ని ‘మోడల్ ఎక్స్ఛేం జ్’గా తయారు చేసి ‘‘నేషనల్ కేరీర్ కౌన్సి ల్ సెంటర్’’గా మార్చడం. తెలంగాణలో ని ఏ జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేం జ్లో రిజిస్టర్ చేసుకున్నా సదరు వ్యక్తి మొ బైల్ నంబర్‌కు ఉద్యోగావకాశాల వివరాలను ఎస్ఎంఎస్ల ద్వారా చేరవేయడం. తెలంగాణలోని బీడీ కార్మికుల సంక్షేమం కోసం వారి పిల్లలకు ఉపకార వేతనాల కింద రూ.9,30,56,210 మంజూరు. మొబైల్ వ్యాన్ల ద్వారా గ్రామాల్లోని వారికి హెల్త్ చెకప్‌లు బీడీ కార్మికులు ఇళ్లనిర్మాణం చేపడితే ఇకపై రూ.1లక్ష ఇచ్చేందుకు నిర్ణయం. సిరిసిల్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ. 70 కోట్లు మంజూరు సనత్‌నగర్ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలకు కృషి నాచారం ఈఎస్ఐకి రూ.253 కోట్లు వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రి రిపేర్ల కోసం రూ. 4 కోట్ల 50 లక్షలు మంజూరు తెలంగాణ రాష్ట్రంలోని డిస్పెన్ససరీలకు రూ. 40 కోట్లు మంజూరు గోషామహల్లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన ముషీరాబాద్ ఐటీఐని అప్‌గ్రేడ్ చేయడానికి కృషి