ఆరు వినికిడి స్క్రీనింగ్‌ సెంటర్లు | hearing Screening Centers in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆరు వినికిడి స్క్రీనింగ్‌ సెంటర్లు

Published Mon, Dec 19 2016 3:18 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

ఆరు వినికిడి స్క్రీనింగ్‌ సెంటర్లు

ఆరు వినికిడి స్క్రీనింగ్‌ సెంటర్లు

హైదరాబాద్‌: పుట్టిన నెలలోపు పిల్లల్లో విని కిడి లోపాన్ని గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఆరు అధునాతన వినికిడి స్క్రీనింగ్‌ సెంట ర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఇందులో ఒక సెంటర్‌ను హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రికి మంజూరు చేసేందుకు తన వంతుగా కృషి చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం ఇప్పటి వరకు అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను వివరిస్తూ.. దరఖాస్తు చేయాల్సిందిగా సంబంధిత అధికా రులను ఆదేశించారు. కోఠిలోని చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ)ఆసుపత్రి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ... ఈ సెంటర్‌ మంజూరైతే ఆస్పత్రికి కేంద్రం నుంచి రూ. వంద కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈఎన్‌టీ ఆస్పత్రి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడిం చిందని, ఇక్కడి ఖాళీ స్థలంలో నూతన భవనం నిర్మించాల్సిందిగా కోరుతూ కేసీఆర్‌కు లేఖ రాస్తానని తెలిపారు.

 ప్రధాని ఆశయం ప్రకా రం ఆస్పత్రిలోని రికార్డులు డిజిటలైజ్‌ కావాల న్నారు. సనత్‌నగర్‌లో రూ.200 కోట్లతో నిర్మించిన ఈఎస్‌ఐ వైద్య కళాశాలలో ఈఎన్‌టీ బ్లాక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జర్మనీ పౌరుడు తాను జర్మన్‌నని, జపాన్‌ పౌరుడు తాను జపనీయుడినని చెప్పు కుంటారు. కానీ మనదేశంలో మాత్రం తాను ఫలానా కులం వాడినని చెప్పుకుంటున్నారని, ఈ సంస్కృతి మారాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ ఆస్పత్రి పూర్వ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలకు ఆయన ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ అరుణా రామయ్య, ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ శంకర్, ఉస్మానియా సూపరింటెండెంట్‌ వి.ఎస్‌. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement