ESIC medical college
-
ఎయిమ్స్ డైరెక్టర్‌గా శ్రీనివాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. డాక్టర్ రణదీప్ గులేరియా స్థానంలో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నియమించినట్టు సిబ్బంది శిక్షణ విభాగం తెలిపింది. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్‌గా ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శ్రీనివాస్ అక్కడే ఎంబీబీఎస్, ఎంఎస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో పీడియాట్రిక్ సర్జన్ (కార్డియో వ్యాస్కులర్ స్పెషలిస్ట్) కోర్సు చేశారు. 1994 నుంచి 2016 దాకా ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పలు హోదాల్లో పని చేశారు. -
కార్మికుల వైద్యానికి పెద్దపీట
► అవినీతి నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది ► కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలో కార్మికుల వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడిం చారు. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శనివారం హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో నిర్వహించిన సింపోజియా నికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. అవినీతి నిర్మూలనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్కామ్‌లు అనే మాటలకు తావులేని విధంగా కేంద్రంలో పరిపాలన సాగుతుందని తెలిపారు. అవినీతిని ఎంత మాత్రం ఉపేక్షించరాదనేది ప్రభుత్వ విధానమన్నారు. ఏ ప్రభుత్వమైనా, సంస్థలైనా అవినీతికి దూరంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఈఎస్ఐసీలో ఆన్ లైన్ లో ఆరోగ్య రికార్డులు గత రెండున్నరేళ్ల కాలంలో కార్మిక శాఖలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానంగా ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ చేశాక వారికి సంబంధించిన సెటిల్మెంట్లకు గతంలో నెలరోజుల సమయం పట్టేదని... తమ ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే పూర్తి సెటిల్మెంట్ చేసేవిధంగా విధి విధానాలు రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 6 నుండి 10 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని వివరించారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీని దేశంలోనే అత్యుత్తమ వైద్య బోధనాసుపత్రిగా రూపొందించాలని... ఇందుకోసం ఉద్యోగులు అంకితభావంతో రోగులకు వైద్య సేవలు అందించడంతోపాటు జవాబుదారితనంతో పనిచేయాలని సూచించారు. ఈఎస్ఐసీలో అందరి ఆరోగ్య రికార్డులను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. దీనివల్ల ఎవరికివారు తమ రికార్డులను పరిశీలించుకోవడానికి వీలుంటుందని... ఆరోగ్య రికార్డులను పరిశీలించడం ద్వారా వైద్యులకు కూడా రోగులకు అత్యుత్తమమైన వైద్యం అందించడానికి దోహదపడుతుం దన్నారు. సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓపీ సేవలు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈఎస్ఐసీలో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు ఆన్ లైన్ లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆధార్ అనుసంధానిత హాజరు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి, కళాశాలలో పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించడంలేదని కాంట్రాక్టు కార్మికులు కేంద్రమంత్రి దత్తాత్రేయకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వినయ్ సహస్ర బుద్దే, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, కళాశాల డీన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ * 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడి * ఇందులో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. వందసీట్లలో ప్రవేశాలకు ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి గురువారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిపారు. ఎంసీఐ నుంచి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసినందుకు మంత్రి దత్తాత్రేయ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ శ్రీనివాస్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలో 35% సీట్లను కార్మికుల పిల్లలకే కేటాయిస్తామన్నారు. వంద సీట్లలో 10% ఆలిం డియా కోటాకు, 35% తెలంగాణ కార్మికుల పిల్లలకు, 55% రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తామని వివరించారు. కార్మిక కోటాలో సీట్లు భర్తీకాకపోతే వాటినీ తెలంగాణ విద్యార్థులకే చెందే లా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన సనత్‌నగర్ మెడికల్ కాలేజీ దేశానికే తలమానికంగా నిలవనుందన్నారు. ఉద్యోగంకోసం 3.60 కోట్లమంది నిరీక్షణ దేశంలో ఉద్యోగ అవకాశాల కోసం దాదాపు 3.60 కోట్ల మంది నిరీక్షిస్తున్నారని దత్తాత్రేయ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌కు వీరు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. అలాగే 9.29 లక్షల కంపెనీలూ ఉద్యోగాలను ఈ పోర్టల్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఓయూలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై మూడో వారంలో సీఐఐ సహకారంతో మెగా జాబ్‌మేళా నిర్విహ స్తామన్నారు. కేంద్రంపై నిందలు సరికాదు రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదని దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ‘ఐటీఐఆర్’కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక (డీపీఆర్) ఎందుకు తయారు చేయలేకపోయిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. డీపీఆర్‌ను కేంద్రానికి అందజేస్తే పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయదనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. -
నిమ్స్, ‘ఈఎస్ఐసీ’ల మధ్య ఒప్పందం
దత్తాత్రేయ, లకా్ష్మరెడ్డి, నాయిని సమక్షంలో ఖరారు సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య బోధన, ఎమర్జెన్సీ సేవలు, లైబ్రరీ వంటి సదుపాయాల విషయంలో పరస్పరం సహకరించుకునేలా ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలే జీ, నిమ్స్ ఆస్పత్రుల మధ్య అవగాహన కుది రింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, రాష్ట్రమంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి సమక్షంలో ఈఎస్ఐసీ, నిమ్స్ అధికారులు శనివారం ఒప్పందం చేసుకున్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ... సనత్‌నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీని దేశంలోనే ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాను న్న మెడికల్ కాలేజీలో 35 శాతం సీట్లు కార్మికుల పిల్లలకే అందేట్లు చూస్తామన్నారు. దేశ వ్యాప్తంగా 47 కోట్ల మంది కార్మికులున్నారని వారికి మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జర్నలిస్టులందరికీ ఈఎస్ఐ వైద్య సేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మజీతియా కమిటీ సిఫారస్సు మేరకు జర్నలిస్టులకు వేజ్‌బోర్డు అమలయ్యేలా చూస్తామన్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశమై దిశా నిర్ధేశం చేస్తామన్నారు. -
ఈఎస్ఐసీ విద్యార్థులకు దత్తాత్రేయ భరోసా
ఢిల్లీ: ఉద్యోగుల రాజ్య బీమా కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లోని వైద్య విద్యార్థులు, సిబ్బంది ప్రయోజనాలు కాపాడతామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ హామీనిచ్చారు. వైద్య విద్య నుంచి తప్పుకోవాలని ఈఎస్ఐసీ నిర్ణయించిన నేపథ్యంలో ఆ కార్పొరేషన్ కాలేజీల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రిని కలసి ఆందోళనను వివరించారు. దీనిపై స్పందించిన దత్తాత్రేయ వైద్య విద్య పూర్తయేవరకూ కార్పొరేషన్ బాధ్యత తీసుకుంటుందని విద్యార్థులకు భరోసానిచ్చారు. ఈ విషయంపై ఈఎస్ఐసీ డీజీతో దత్తాత్రేయ సమీక్షించారు. విద్యార్థులకు, సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత డీన్‌ను లేదా ఈఎస్ఐసీ డీజీని కలవాలని సమీక్ష అనంతరం చెప్పారు. ఈఎస్ఐసీ వైద్య కళాశాలలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే.. కోర్సులు యథాతథంగా కొనసాగుతాయని, లేదంటే ప్రస్తుతం అడ్మిట్ అయిన విద్యార్థుల కోర్సు పూర్తయే వరకూ ఈఎస్ఐసీ వాటిని నిర్వహిస్తుందని దత్తాత్రేయ వెల్లడించారు. కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోని పక్షంలో ఆయా కాలేజీలను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా వినియోగిస్తామన్నారు. ఇక ఫ్యాకల్టీలను డిప్యుటేషన్‌పై ప్రభుత్వ కాలేజీలకు మారుస్తామని, రిటైరయ్యేవరకూ వారు అక్కడ పనిచేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.