లక్డీకాపూల్ : తమకు న్యాయం చేయాలని కోరుతూ నిమ్స్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది. తమను జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) కిందకు తీసుకురావాలని డిమాండ్ వంద రోజులుగా హధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేస్తున్నారు.
పెన్షన్ సదుపాయాన్ని ఈపీఎఫ్ నుంచి నిమ్స్‌కు మార్చాలని డిమాండ్ డిమాండ్ చేశారు. గతంలో నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది 32 మంది, డాక్టర్లు 12 మందికి కల్పించిన విధంగానే తమకు కూడా నిమ్స్ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ బాధితుల ప్రతినిధులు, శాంతి కుమారి, మధు కుమార్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment