నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డు
సోమాజిగూడ: నిమ్స్‌లోని అత్యవసర వైద్యసేవల విభాగానికి వచ్చే రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు...దూర ప్రాంతాల నుంచి అడ్మిషన్ కోసం వచ్చే రోగులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాంతో నిమ్స్ ప్రతిష్ట మసక బారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అత్యవసర విభానికి వచ్చిన రోగులకు సకాలంలో అడ్మిషన్లు దొరకడంలేదు. బెడ్స్ ఖాళీ లేవంటూ చెప్పడంతో చికిత్స కోసం వచ్చిన వారు తాము వచ్చిన వాహనంలోనే గంటల తరబడి వైద్యుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజుల క్రితం విషం తాగి చావు బతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తిని మహేశ్వరం నుంచి తీసుకురాగా.. వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో గంట పాటు అతను అలాగే వాహనంలో పడి ఉన్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళను మంగళవారం అత్యవసర విభాగంలో చికిత్స కోసం తీసుకు రాగా.. అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడి సిబ్బందితో సదరు పేషెంట్ బంధువులు వాగ్వాదానికి దాగారు. ఇలా నిత్యం నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద వైద్యసేవల విషయంలో రోగుల బంధువులు వైద్యులు, అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగంలో అడ్మిషన్ దొరకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది.
స్ట్రెచర్స్ లేవంటూ...
నిమ్స్ అత్యవసర విభాగానికి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు సుమారు 100 మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు, విషం తాగిన వారు, ఇతర వ్యాధుల బారిన పడిన వారు... ఇలా ఎందరో రోగులు నిమ్స్‌లో చికిత్స కోసం వస్తుంటారు. దాంతో అత్యవసం విభాగం రోగులతో కిక్కిరిసిపోతోంది. అలా చికిత్సకు వచ్చిన వారిలో 50 మంది రోగులకు మాత్రమే అడ్మిషన్ దొరుకుతోంది. మరికొందరికి స్ట్రెచర్ సైతం దొరక పోవడంతో మిగతా రోగులు వెనుదిరగాల్సి వస్తోంది.
సిబ్బంది అవసరం...
అత్యవసర వైద్యసేవల విభాగంలో అవరానికి అ నుగుణంగా దిగువ స్థాయి సిబ్బంది లేక పోవడం తో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వెంటిలేటర్ల సంఖ్య కూడా తక్కువే. ఉన్నవాటిలో ఐదు మూలన పడ్డాయి. రోగుల సం ఖ్య కు అనుగుణంగా సిబ్బందిని పెంచడంతో పా టు మరో 10 వెంటిలేటర్లను అదనంగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. నిమ్స్ యాజమాన్యం ఎమర్జెన్సీ వార్డులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment