emergecy
-
మీ మాటలు వింటే భయమేస్తోంది: కంగనా కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ, చంద్రముఖి సినిమాలతో బిజీగా ఉంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ఎమర్జన్సీ. ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కంగనా మూవీ ఎమర్జన్సీ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని అన్నారు. కరణ్ జోహార్ ట్వీట్‌పై కంగనా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) కంగనా స్పందిస్తూ.. "హాహా లాస్ట్ టైమ్ కూడా నా చిత్రం మణికర్ణికను చూడాలని ఎక్సైట్‌గా ఉందని చెప్పినప్పుడు.. మూవీ రిలీజైన వారాంతంలో నాపై పెద్దఎత్తున విష ప్రచారం చేశారు. నా సినిమాపై బురద చల్లేందుకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా నా మూవీ చూడాలని ఆసక్తిగా ఉందంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. అమ్మో మీరు అలా మాట్లాడుతుంటే నాకు నిజంగా భయమేస్తోంది. ఎందుకంటే మీరు మళ్లీ ఉత్సాహంగా ఉన్నానని చెప్పడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందో.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. ఇటీవలే కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ చిత్రంపై కంగనా విమర్శలు చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని.. కలెక్షన్స్, రివ్యూలన్నీ ఫేక్ అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంగనా చిత్రంపై కరణ్ చేసిన కామెంట్స్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఎమర్జన్సీ చిత్రం నవంబర్ 2023లో విడుదల కానుంది మణికర్ణిక వివాదం గతంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019) వివాదానికి దారితీసింది. ఆ చిత్రం నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్.. కంగనాపై ఆరోపణలు చేశాడు. అయితే క్రిష్ చిత్రం నుంచి తప్పుకోవడంతో కో-డైరెక్టర్ సహాయంతో ముఖ్యమైన సీన్స్ రీషూట్ చేసినట్లు వెల్లడించింది. తాము 70 శాతం సినిమా చిత్రీకరించినట్లు కంగనా చేసిన వాదనలను అప్పట్లో క్రిష్ వ్యతిరేకించారు. కాగా.. కంగనా నటిస్తోన్న ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, విశాక్ నాయర్, శ్రేయాస్ తల్పాడే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించిన తేజస్ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం చంద్రముఖి -2లో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!) Ha ha last time when he said he was excited to see Manikarnika, the worse smear campaign of my life was unleashed upon me on its releasing weekend … almost all main actors working in the film were paid to sling mud on me and sabotage the film and suddenly the most successful… https://t.co/iruVo5wq5o — Kangana Ranaut (@KanganaTeam) August 22, 2023 -
Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటన
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ.. మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే. దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు విక్రమ సింఘే. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జులై 18 నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి. ఇదీ చదవండి: శ్రీలంక ఆందోళనలకు 100 రోజులు.. సమస్య సద్దుమణిగేనా? -
చీకటి ఎమర్జెన్సీకి 45 యేళ్లు
ఎమర్జెన్సీ ప్రకటించిన అర్ధరాత్రి తెల్లారే, ఇవ్వాళ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్య నాయకులంతా జైళ్ళలోనే ఉన్నారు. మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, ఎల్.కె.అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇలా ‘అంతర్గత భద్రత’కు ముప్పు అను కున్న వారినందరినీ నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌తో ‘రబ్బర్ ముద్ర’ కొట్టించి చీకటి కొట్టాలకు తరలించింది. లక్షమందికి పైబడిన ఆరెస్సెస్ సైన్యం ‘అభివృద్ధి నిరోధకులు’గా ముద్రపడి నిర్భందానికి గురయినారు. విప్లవ కమ్యూనిస్టుల అరెస్టులు, చిత్ర హింసల, ఎన్కౌంటర్లకు అదుపే లేదు. సిక్కుల హక్కులు, అకాలీ కార్యకర్తలు అపర ‘కాళీమాత’ ఇందిరాగాంధీ కంటి వేడికి దగ్ధమయిన తీరు ‘శిరోమణి గురు ద్వారా’ల్లో ఇప్పటికీ చర్చిస్తూనే ఉంటారు. భూమయ్య, కిష్టాగౌడ్‌ను ఉరి తీయవద్దని, రైట్–లెఫ్ట్, వాజ్‌పేయి, జయప్రకాశ్ నారాయణ్, శ్రీశ్రీ, జార్జ్ ఫెర్నాండెజ్, జైపాల్‌రెడ్డి, భూపేష్ గుప్తా, కన్నాభిరాన్, చండ్ర రాజేశ్వర్రావ్, ఇంకెందరో 1975లో ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన వారే. అయితే సరిగ్గా 45 యేండ్ల తరువాత ఉరిశిక్షలు, ఎన్కౌంటర్లు వద్దన్న వాళ్ళు ఇప్పుడు మోదీ ప్రభుత్వ మార్గదర్శకులుగా ఉన్నారు. మరోవైపు ఇతరులంతా తుకుడే తుకుడే గ్యాంగ్‌గా ముద్రపడి ప్రతి పక్షంలో ఉన్నారు. పైగా, ఈ దేశంలో అత్యంత దారుణ పరిస్థితు లలో తప్పుడు కేసుల్లో భీమ్ కోరేగావ్ అల్లర్ల పేర ప్రొఫెసర్ సాయి బాబా, వరవరరావు, సోమా సేన్, గౌతమ్ నవలాభా, ఆనంద్ తేల్ తుంబ్డే, సుధా భరద్వాజ్, విల్సన్ ఇంకా ఎందరో నెలల తరబడి జైళ్ళలో ఉండటాన్ని ఎట్లా చూడాలి? ఎన్కౌంటర్లు రాజకీయ హత్యలన్నది ఒక అంశమయితే, ఎన్కౌంటర్లు లేకుండా చీకటి గుహల్లో రాజకీయ ఖైదీలకు ఉండే సౌకర్యాలు కూడా లేకుండా చేసి బ్రతికి ఉన్నన్నాళ్లు అందులోనే మగ్గి చచ్చి పోవాలని చూస్తున్న తీరు మరో అంశం. లక్షల మందిని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడగట్టి, ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టడం కోసం అన్ని రాజకీయ పక్షాలతో ఫ్రంట్ కట్టి, ఇందిరకు చుక్కలు చూపెట్టిన నాగ్‌పూర్‌లోని కార్యాలయం ‘నాగ్, నాగ్’ అంటూ ఇప్పుడు బుసలు కొట్టడం ఒక సాంస్కృతిక సేనాని సంస్థ చేసే పనేనా? నాకు బాగా గుర్తున్నది ఒకసారి కుల్దీప్ నయ్యర్ ఎమర్జెన్సీ అనంతరం రాజకీయ సమరశీలత, నిబద్ధత, గొప్ప యువతరం వనరు ఉన్నది ఆరెస్సెస్, నక్సలైట్లలోనేనని అన్నారు. ఎమర్జెన్సీకి పదిరెట్లు హక్కులు కుంచించుకుపోయిన దేశంలో ఈ ఇద్దరికీ దేశ రాజకీయాల్లో ఉన్న ప్రాభవమెంత? అంగీకారమెంత? అన్నది వేరే చర్చగానీ ఎమర్జెన్సీని తెచ్చిన కాంగ్రెస్‌ను ఇప్పుడు లిబరల్ పార్టీగా ఎక్కువ మంది గుర్తించటం ఆశ్చర్యమే! ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాల హక్కులు, ప్రజల హక్కులు కాపాడతామని మాట్లాడే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి ఇలాఖాలో ఇష్టారాజ్యం, హక్కుల హననం కొనసాగిస్తూనే ఉన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, స్థానిక పోలీసులకు ‘చట్ట బద్ద కొమ్ములు’ ఇచ్చి అన్ని రాష్ట్రాల్లో స్థానిక నల్ల చట్టాలతో అణచివేత కొనసాగించేలా చూసే వివిధ రాష్ట్రాల నేతలు నిన్నటి తమ గొప్ప ప్రజాస్వామ్య ప్రాభవాన్ని, స్ఫూర్తిని మరిచి జాతికి ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్లు లేకుండా పాలకులు బతుకలేరు. అధీకృత హింస లేకుండా నక్సలైట్లు బతుకలేరు. యుద్ధ ప్రభువులు రాష్ట్రాలు, ప్రాంతాల్లో అధికారంతో పాటు వనరులు కొల్లగొట్టి, సంపదను, శ్రమను కొల్లగొట్టే వాళ్ళకు సహకరిస్తూ– వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలకు వాటాదారులయి, విపరీతమైన ఎన్నికల పెట్టు బడితో, సాంకేతిక లబ్ధితో అనుకూల ఫలితాలు సాధిస్తూ, ఇదే ప్రజాస్వామ్యమని ఊరేగుతున్నప్పుడు జూన్ 25న జడలు విర బోసుకున్న నాటి అత్యవసర పరిస్థితి ‘వేయి నాలుకల భద్రకాళి’ నేటికీ వెంటాడినట్లే అనిపిస్తుంది. స్వాతంత్య్రం తొలినాటి ప్రజా తంత్ర వైభవాలు కాల గర్భంలో కలిసినట్లే అనిపిస్తుంది. మన కళ్ళ ముందు యాభై యేండ్ల చరిత్రలో ఎన్నో అధిగ మించలేని సవాళ్ళు. గింగిరులు కొడుతున్న సుడి గుండాలు. గుండె దిటవుతో పోరాడే దివిటీలు. రాజ్యాంగం పీఠికపై మొలుస్తున్న కొత్త సింగిడీలు. ఏ కాన్వాసు మీద చిత్రీకరించలేని రఫ్ పెయింటింగ్ వర్తమాన భారతం. ఏ కవీ, తత్వవేత్త ఏకవేదంగా కూర్చి, విడ మర్చి, య«థా లాపంగా చెప్పలేని సమకాలీన భారత రాజకీయంలో ఏ సోయి, ఏ గాయం గమ్యంలో, గమనంలో లేని ఒక సౌకర్యవంతమైన ధారావాహికకు... చీకటి రోజు... ఉజ్వల ఉత్తానం– ఉదాత్త మానవ పునరుత్తానం... అన్నీ ఉట్టి మాటలే. చీకటిని చీల్చి గుండెను ఎదురునిల్చి సమాధుల్లో వొరిగి పోయిన వాళ్ళ బంధువులకు, రక్త సంబంధీకులకు తమ వాళ్ళు వదిలి పెట్టిన బాధ్యత గుర్తు రావాలని ఆశించడం అత్యాశ ఏమి కాదు. అట్లా మిగిలి ఉన్న అమరుల స్మృతి చిహ్నాలను కూడా ధ్వంసం చేస్తూనే ఉన్నారు. దర్శించుకుంటే నేరమని అంటారు అందరు పాలకులు. సిక్కుల ఊచకోతలో కాంగ్రెస్ భాగస్వామ్యమయిన సంఘ టనలు దురదృష్టకరమని, విచారకరమన్న సోనియాజీ అట్లనే అత్యవసర పరిస్థితుల పర్యవసానాలకు నాటి కాంగ్రెస్‌కు రాజకీయ వారసులు అయినందున విచారం వ్యక్తం చేస్తే ఎంత బాగుండు? అట్లాంటిది పునరావృతం కాదని అనే పాలకులు ఎవ్వరో వొడిసి పట్టుదాం. డాక్టర్ చెరుకు సుధాకర్ , వ్యాసకర్త, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
బహమాస్‌లో హరికేన్ బీభత్సం
-
నిమ్స్ ఎమర్జెన్సీలో వైద్యం గగనమే!
సోమాజిగూడ: నిమ్స్‌లోని అత్యవసర వైద్యసేవల విభాగానికి వచ్చే రోగులు నరకాన్ని చవిచూస్తున్నారు...దూర ప్రాంతాల నుంచి అడ్మిషన్ కోసం వచ్చే రోగులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాంతో నిమ్స్ ప్రతిష్ట మసక బారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అత్యవసర విభానికి వచ్చిన రోగులకు సకాలంలో అడ్మిషన్లు దొరకడంలేదు. బెడ్స్ ఖాళీ లేవంటూ చెప్పడంతో చికిత్స కోసం వచ్చిన వారు తాము వచ్చిన వాహనంలోనే గంటల తరబడి వైద్యుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వారం రోజుల క్రితం విషం తాగి చావు బతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తిని మహేశ్వరం నుంచి తీసుకురాగా.. వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో గంట పాటు అతను అలాగే వాహనంలో పడి ఉన్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళను మంగళవారం అత్యవసర విభాగంలో చికిత్స కోసం తీసుకు రాగా.. అక్కడ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడి సిబ్బందితో సదరు పేషెంట్ బంధువులు వాగ్వాదానికి దాగారు. ఇలా నిత్యం నిమ్స్ ఎమర్జెన్సీ వార్డు వద్ద వైద్యసేవల విషయంలో రోగుల బంధువులు వైద్యులు, అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగంలో అడ్మిషన్ దొరకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. స్ట్రెచర్స్ లేవంటూ... నిమ్స్ అత్యవసర విభాగానికి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోజుకు సుమారు 100 మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు, విషం తాగిన వారు, ఇతర వ్యాధుల బారిన పడిన వారు... ఇలా ఎందరో రోగులు నిమ్స్‌లో చికిత్స కోసం వస్తుంటారు. దాంతో అత్యవసం విభాగం రోగులతో కిక్కిరిసిపోతోంది. అలా చికిత్సకు వచ్చిన వారిలో 50 మంది రోగులకు మాత్రమే అడ్మిషన్ దొరుకుతోంది. మరికొందరికి స్ట్రెచర్ సైతం దొరక పోవడంతో మిగతా రోగులు వెనుదిరగాల్సి వస్తోంది. సిబ్బంది అవసరం... అత్యవసర వైద్యసేవల విభాగంలో అవరానికి అ నుగుణంగా దిగువ స్థాయి సిబ్బంది లేక పోవడం తో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వెంటిలేటర్ల సంఖ్య కూడా తక్కువే. ఉన్నవాటిలో ఐదు మూలన పడ్డాయి. రోగుల సం ఖ్య కు అనుగుణంగా సిబ్బందిని పెంచడంతో పా టు మరో 10 వెంటిలేటర్లను అదనంగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. నిమ్స్ యాజమాన్యం ఎమర్జెన్సీ వార్డులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులో ఉంచాలి. -
ఎమర్జెన్సీని తలపించేలా కేసీఆర్ పాలన
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వతీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని శాసనసభలో బీజేపీ పక్షనేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే పరిస్థితులు లేవు. కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల్లో ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, బాధ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాళ్లకు ఇనుప సంకెళ్లు వేశారు. ఇప్పుడు రైతుల చేతులకు బంగారు సంకెళ్లు వేస్తున్నారు. వర్గీకరణపై పోరాడిన మంద కృష్ణను రెండుసార్లు జైలుకు పంపారు. మీడియా గొంతు నొక్కేస్తున్నారు. కలాలకు, కళాకారులకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసి బంగారు తెలంగాణ సాధిస్తారా?’అని ప్రశ్నించారు. నేతల భాషపైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. రైతులకు పావలా వడ్డీకి రుణాలివ్వాల్సిన అవసరం ఉందని, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు అరకొర నిధులతో పనులు జరగక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందని, దీనిపై అధికారులతో చర్చించి వీలై నంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
ముంబై–లండన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
లండన్: ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం సాంకేతిక కారణాలతో అత్యవసరంగా అజర్‌బైజాన్‌లోని బాకూలో ల్యాండైంది. సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ముంబైనుంచి బీఏ198 విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఫస్ట్‌క్లాస్ కేబిన్‌లో పొగరావటంతో మూడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. అనంతరం అజర్బైజాన్ సమీపంలో ఉన్నప్పుడు ఇదే సమస్య తలెత్తటంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ‘సాంకేతిక కారణాలతో బాకూలో ఆగాం’ అంటూ ఓ ప్రయాణికుడు ట్వీట్ చేయటంతో ఈ విషయం తెలిసింది. ఆ బోయింగ్ 777 విమానంలో ఎందరు ప్రయాణీకులున్నారనే విషయాన్ని విమానయాన సంస్థ వెల్లడించలేదు. -
112 అమలుకు తెలంగాణ ఎంపిక
* తొలుత పైలట్ ప్రాజెక్టుగా నిర్వహణ * రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం * రెండు నెలల్లో అందుబాటులోకి కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112 సాక్షి, హైదరాబాద్: ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేయనున్న కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112కు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం ఎంపికైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర హోం శాఖ ఇటీవల అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతమున్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నెంబర్ల స్థానంలో దేశ వ్యాప్తంగా 112ను తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. జాతీయ అత్యవసర స్పందన వ్యవస్థ (ఎన్‌ఈఆర్‌ఎస్) ద్వారా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం మొదట గుజరాత్, తెలంగాణను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేంద్రం దాదాపు రూ.100 కోట్ల విలువైన సాంకేతిక పరికరాలను అందించనుంది. దీని ద్వారా అత్యవసర సేవలు మరింత సులభతరం, వేగవంతం కానున్నాయి. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. కేంద్రానిదే నిర్వహణ ఖర్చు..: పోలీస్, మెడికల్, అగ్నిమాపక తదితర సేవల కోసం ప్రస్తుతం వేర్వేరు నంబర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాగే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నంబర్ ఉంటోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఒకే నంబర్ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రమే సమకూర్చనుంది. జీపీఎస్ ఆధారంగా ఆపదలో ఉన్న వారి దగ్గరికి దగ్గర్లోని పోలీసులను పంపిస్తారు. ఇదంతా నిమిషాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి కాల్‌సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రానికి డబ్బులు ఆదా..: నేరాలను అరికట్టడం, ప్రజలకు సమర్థమైన పోలీసు సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త వాహనాలు, స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చు ట్టింది. పోలీసు వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థను పొం దుపరిచి ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే వారి దగ్గరికి క్షణాల్లో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు కూడా మం జూరు చేసింది. అయితే కేంద్రం ప్రవేశపెట్టి ఎమర్జెన్సీ నంబర్ 112 ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ భావాలకు అనుగుణంగా ఉండటం, నిర్వహణ ఖర్చులను కేం ద్రమే భరించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పోలీసు శాఖ వెనక్కి పంపించింది.