మీ మాటలు వింటే భయమేస్తోంది: కంగనా కామెంట్స్ వైరల్! | Kangana Ranaut REACTS on Karan Johar Comments On Her Film Emergency | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: కరణ్‌పై కంగనా సెటైర్లు.. నిజంగానే భయమేస్తోందంటూ!

Aug 22 2023 6:39 PM | Updated on Aug 22 2023 7:06 PM

Kangana Ranaut REACTS on Karan Johar Comments On Her Film Emergency - Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జన్సీ, చంద్రముఖి సినిమాలతో బిజీగా ఉంది. ఇందిరాగాంధీ రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రం ఎమర్జన్సీ. ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కంగనా మూవీ ఎమర్జన్సీ చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని అన్నారు. కరణ్ జోహార్ ట్వీట్‌పై కంగనా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. 

(ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్‌లో ఉండనుంది'.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నటుడు!)

కంగనా స్పందిస్తూ.. "హాహా లాస్ట్ టైమ్ కూడా నా చిత్రం మణికర్ణికను చూడాలని ఎక్సైట్‌గా ఉందని చెప్పినప్పుడు.. మూవీ రిలీజైన వారాంతంలో నాపై పెద్దఎత్తున విష ప్రచారం చేశారు. నా సినిమాపై బురద చల్లేందుకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా నా మూవీ చూడాలని ఆసక్తిగా ఉందంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. అమ్మో మీరు అలా మాట్లాడుతుంటే నాకు నిజంగా భయమేస్తోంది. ఎందుకంటే మీరు మళ్లీ ఉత్సాహంగా ఉన్నానని చెప్పడం వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందో.' అంటూ ట్వీట్ చేసింది.

కాగా.. ఇటీవలే కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ  చిత్రంపై కంగనా విమర్శలు చేసింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని.. కలెక్షన్స్, రివ్యూలన్నీ ఫేక్ అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కంగనా చిత్రంపై కరణ్ చేసిన కామెంట్స్ బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ఎమర్జన్సీ చిత్రం నవంబర్ 2023లో విడుదల కానుంది

మణికర్ణిక వివాదం 
గతంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019) వివాదానికి దారితీసింది. ఆ చిత్రం నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్.. కంగనాపై ఆరోపణలు చేశాడు. అయితే క్రిష్ చిత్రం నుంచి తప్పుకోవడంతో కో-డైరెక్టర్ సహాయంతో ముఖ్యమైన సీన్స్ రీషూట్ చేసినట్లు వెల్లడించింది. తాము 70 శాతం సినిమా చిత్రీకరించినట్లు కంగనా చేసిన వాదనలను అప్పట్లో క్రిష్ వ్యతిరేకించారు.

కాగా.. కంగనా నటిస్తోన్న ఎమర్జెన్సీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, విశాక్ నాయర్, శ్రేయాస్ తల్పాడే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆ తర్వాత కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించిన తేజస్ విడుదలకు కూడా సిద్ధమవుతోంది. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం చంద్రముఖి -2లో కూడా కనిపించనుంది. 

(ఇది చదవండి: అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement