
నిమ్స్‌లో ‘చిల్లర’ మాయం!
రోగులు చెల్లించిన 10 లక్షలు మాయమైనట్లు సమాచారం
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చెల్లిస్తున్న చిన్న నోట్లు మాయమవుతున్నాయి. ఓ ఉన్నతాధికారి తన అధికారంతో అతనివద్ద ఉన్న పెద్ద నోట్లను క్యాష్ కౌంటర్ల లో ఉంచి.. రూ.100, రూ.50 నోట్లను పెద్ద మొత్తంలో తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తు న్నాయి. ఇలా ఇప్పటివరకూ రూ.10 లక్షల వరకు చిల్లర మాయమైనట్లు సమాచారం. నల్లధనం అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అవినీతి అధికారు లు వారి వద్ద ఉన్న దొంగ సొమ్మును ఎలా వైట్ చేసుకోవాలఅన్న ఆలోచనలో పడ్డారు.
నిమ్స్‌లోని ఓ ఉన్నతాధికారి దీనికి ఆసుపత్రి నే వాడుకుంటూ తన సొత్తును వైట్ చేసుకుం టున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిమ్స్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్లను చలామణి చేస్తున్నారు. ఉదయం పూట ఓపీకి రూ.50, చిన్న వైద్య పరీక్షలకు రూ.100,రూ.200 మాత్రమే అవుతుండడం, ఎక్కువమంది పేదలు ఆసుపత్రికి వస్తుం డడంతో రూ.500, రూ.వెరుు్య నోట్లకన్నా చిల్లరే ఎక్కువగా తీసుకువస్తారు.
పెద్ద నోట్లు క్యాష్ కౌంటర్‌లో...
క్యాష్ కౌంటర్‌లో ఉన్న చిల్లరను ఓ అధికారి తన వద్ద ఉన్న బ్లాక్‌మనీని ఆ స్థానంలో ఉంచి రూ.100, రూ.50 నోట్లను తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం సుమారు రూ.10 లక్షల వరకూ ఉన్నట్టు సమాచారం. అలాగే కొంతమంది అధికారులు నిమ్స్‌లో పనిచే స్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు పెద్దమొత్తంలో నగదు ఇచ్చి వారి ఖాతాలో జమ చేసు కొమ్మని చెపుతున్నట్లు సమాచారం. కాంట్రా క్ట్ వర్కర్లు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయడంతో అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది గట్టిగా ప్రశ్నించగా వారు అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిసింది.