హైదరాబాద్: నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయం, నిమ్స్ వద్ద భారీగా పోలీసులను మొహరించారు. కాంట్రాక్ట్ కార్మికులు భారీ ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.