నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో రోగులకు బెడ్ల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగి అత్యవసర పరిస్థితిలో.. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా 040-23305463 నెంబర్‌కు ఫోన్ చేసి రోగి ఏ పరిస్థితిలో ఉన్నారు.
- ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్, తలసాని
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో రోగులకు బెడ్ల సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగి అత్యవసర పరిస్థితిలో.. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా 040-23305463 నెంబర్‌కు ఫోన్ చేసి రోగి ఏ పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో చెబితే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్న సమాచారాన్ని అందించనున్నారు. బెడ్లు అందుబాటులో ఉంటే రోగిని ఆసుపత్రికి తీసుకువచ్చే లోపు బెడ్‌ను సిద్ధం చేసి రోగికి అందించాల్సిన వైద్య పరికరాలను సైతం సిద్ధం చేసి ఉంచనున్నారు.
ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను శుక్రవారం మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిమ్స్ డెరైక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎమర్జెన్సీ వార్డులో కేవలం 40 బెడ్లు మాత్రమే ఉండేవని ప్రస్తుతం 96కు పెంచామని చెప్పారు. ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన రోగిని 24 గంటల్లో వార్డులోకి మార్చి నిత్యం ఎమర్జెన్సీలో బెడ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారి పాల్గొన్నారు.