'తెలంగాణలో ఒక్క పార్టీ కూడా ఉండేది కాదు'
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతోందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ విమర్శించారు. మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సంఘటనను సుమోటగా తీసుకుని విచారణకు ఆదేశించాలని కోరినట్లు దానం నాగేందర్ సోమవారమిక్కడ తెలిపారు.
గతంలో తాము ఇదేవిధంగా వ్యవహరించి ఉంటే తెలంగాణలో ఒక్క పార్టీ కూడా ఉండేది కాదన్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ఓపిక ఉండాలని దానం వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో రూ200 కోట్ల వృధా చేశారని, మెట్రో వాటర్ వర్క్స్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు.