అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరుగనున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు ఆదివారం సాయంత్రం హల్ చల్ చేశాయి. ఆదివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి అయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విందులో కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో మహిళలకు కూడా చోటు దక్కవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. దాంతో అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ చేపట్టవచ్చని మీడియా కథనాల్లో వెల్లడించారు. తాజా కేబినెట్ విస్తరణ వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆశలు పెరిగాయి.