
కేంద్రం చేతిలో అధికారం ఉంటే మేము ఏం చేయాలి?
హైదరాబాద్ : హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకునేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్పై ఏది పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమంటూ కొందరు చేస్తున్న వాదనలపై దానం మండిపడ్డారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే.... ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని (చీపుళ్లు పట్టుకోవాలా) అని ఎద్దేవా చేశారు.
కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు. హైదరాబాద్ యూటీ అంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎల్పీలో తీర్మానం చేశామని దానం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు స్పీకర్గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.