సాక్షి,హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహనం కోల్పోయారు. తీవ్ర పదజాలంతో బీఆర్‌ఎస్ సభ్యులపై ఫైరయ్యారు. ‘తోలు తీస్తా . మిమ్మల్ని బయటకు కూడా తిరగనివ్వం ఏం అనుకుంటున్నార్రా’ అంటూ బెదిరించారు. అయితే దానం వ్యాఖ్యల్ని బీఆర్‌ఎస్, ఎంఐఎంలు నేతలు ఖండించారు. దానం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో దానం క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. తాను మాట్లాడింది హైదరాబాద్ లోకల్ భాష అని, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.
Comments
Please login to add a commentAdd a comment