
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ ఘర్షణ కేసులో మాజీ మంత్రి దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి వరప్రసాద్ బుధవారం తీర్పునిచ్చారు. కాగా, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment