హైదరాబాద్ : ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని గర్నవర్ నరసింహన్ను కోరినట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఆయన మంగళవారం గవర్నర్ కలిసి ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. భేటీ అనంతరం దానం విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో దొరల రాజ్యం తేవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకుంటామని దానం తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలతో కేసీఆర్కు దిమ్మ తిరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.