నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: దానం | danam nagendar says he will continue to Congress party | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్లోనే ఉన్నా, అందులోనే కొనసాగుతా’

Published Tue, Oct 18 2016 12:59 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: దానం - Sakshi

నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: దానం

హైదరాబాద్ : తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కొనసాగుతానని మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలనే సంయమనం పాటిస్తున్నామని దానం వ్యాఖ్యానించారు.

తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని ఆయన చెప్పుకొచ్చారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఓ దశలో ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement