
రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే: మంత్రి దానం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విలీనమైనా.. కాకున్నా, పొత్తు కుదిరినా.. కుదరకపోయినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఓ బస్తీకి చెందిన కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇస్తానని చెప్పిన సోనియాగాంధీ మాటకు కట్టుబడ్డారని, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్ కూడా అదే రీతిలో మాటపై నిలబడాలని దానం కోరారు.