హైదరాబాద్ : తెలంగాణలో దొరల పెత్తనం సాగనివ్వమని మాజీమంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్లోనూ దొరల హవానే సాగుతోందని విమర్శించారు. తనకు పీసీసీ పదవి రాకుండా అడ్డుకుంది దొరలేనని దానం వాపోయారు. బడుగు, బలహీన వర్గాల వారికే తెలంగాణ సీఎం పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.