
డ్రగ్స్ కేసును నిర్వీర్యం చేస్తున్నారా : దానం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసును నిర్వీ ర్యం చేస్తున్నారని మాజీమంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో అధికారులపై ఒత్తిడి ఉందని అన్నారు.
కేవలం సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్‌ను వాడుతున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి మూడుగంటల వరకు పబ్స్ ఎలా నడుస్తున్నాయని, డ్రగ్స్‌ను నియంత్రించడానికి నైజీరియన్, సొమాలియన్లపై ప్రభుత్వం నిఘా పెట్టిందా అని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కేవలం సెలబ్రిటీల పేర్లే ఎందుకు బయటకు వస్తున్నాయని దానం అనుమానం వ్యక్తం చేశారు.