
మంత్రి దానం నాగేందర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎంఐఎంకు విభేదాలు ఉన్నప్పటికి అధిష్టానంతో మాత్రం సన్నిహిత సంబంధాలే ఉన్నాయని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని శాసనసభా స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఎంఐఎంతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
ఏఐసీసీ పరిశీలకురాలు విజయధరణి ఈరోజు గాంధీభవన్‌లో మంత్రి దానం నాగేందర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నానని చెప్పారు. అందరి అభిప్రాయాలను అధిష్టానానికి నివేధిస్తానన్నారు.