ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ: ముఖేష్ | Telangana will form on February 3rd Week, mukhesh goud | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ: ముఖేష్

Published Sat, Feb 1 2014 11:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ: ముఖేష్ - Sakshi

ఫిబ్రవరి మూడోవారంలో తెలంగాణ: ముఖేష్

విజయవాడ : ఫిబ్రవరి మూడో వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మంత్రి ముఖేష్ గౌడ్ జోస్యం చెప్పారు. శనివారం ఆయన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.

ముఖ్యమంత్రి అధిష్టానాన్ని ధిక్కరించారనటం సరికాదని, ఆయన తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహిస్తున్నారని ముఖేష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో బీజేపీ సహకరిస్తే తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement