గ్రేటర్‌ పోలింగ్‌ 46.55%  | GHMC Elections 2020: 46 Percent Voter Turnout | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ పోలింగ్‌ 46.55% 

Dec 3 2020 2:29 AM | Updated on Dec 3 2020 2:31 AM

GHMC Elections 2020: 46 Percent Voter Turnout - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ లెక్కలు తేలాయి. మొత్తం 74,12,601 మంది ఓటర్లలో 34,50,331 మంది ఓట్లు వేశారని, 46.55 శాతం పోలింగ్‌ జరిగిందని అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ శాతంపై ఒకటో తేదీ అర్ధరాత్రి దాటాక కూడా విభిన్న గణాంకాలు వెల్లడిస్తూ వచ్చారు. దాంతో కొంత గందరగోళం నెలకొంది. అంతిమంగా 46.55 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ బుధవారం స్పష్టం చేశారు. గురువారం రీపోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓల్డ్‌ మలక్‌పేటను మినహాయించి ఈ వివరాలు వెల్లడించారు. పోలింగ్‌ జరిగిన 149 వార్డుల్లో అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం ఓట్లు పోలయ్యాయి. 

60% దాటిన డివిజన్లు 3 
డివిజన్‌    పోలింగ్‌
ఆర్‌సీపురం    67.71 
పటాన్‌చెరువు    65.77
భారతీనగర్‌    61.88



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement