సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందని, అందుకే సక్సెస్ టూర్ ప్లాన్ చేశామని చిత్రబృందం పేర్కొంది. ‘‘మా బేనర్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ని ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఇప్పుడు ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ సినిమాకి ఘనవిజయం అందించారు. అందుకే ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లోని ప్రేక్షకులను ఇవాళ (గురువారం) కలుస్తాం. శుక్రవారం విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మా సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్స్‌ని సందర్శిస్తాం. ఆంధ్ర టూర్ కంప్లీట్ చేసిన తర్వాత తెలంగాణలో ప్లాన్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాత డా. రవికిరణ్. నటుడు, ఎంపీ ఎన్. శివప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భారతీరాజాగారి డైరెక్షన్‌లో ఓ తమిళ సినిమా చేశా.
అక్కడి షూటింగ్ వాతావరణానికి భయపడి, సినిమాలు వద్దనుకున్నా. నూతన ప్రసాద్‌గారి ‘ఓ అమ్మకథ’లో నటించాను. ఆ తర్వాత 5 ఏళ్లలో 56 సినిమాలు చేశా. బేసిగ్గా ఆర్టిస్టుని కాబట్టి ఏడాదికి రెండు సినిమాలైనా డైరెక్ట్ చేయాలని ‘ప్రేమ తపస్సు’ సినిమా స్టార్ట్ చేశా. తర్వాత మరికొన్ని సినిమాలు తీశా. సడన్‌గా పాలిటిక్స్ వైపు లైఫ్ టర్న్ అయ్యింది. అయినప్పటికీ ‘బాలు, డేంజర్, ఆటాడిస్తా, పిల్లజమీందార్’ సినిమాల్లో చేశా. నా నటనకు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’లో నేను, సాయికుమార్, సప్తగిరి పోటీపడి నటించాం. ప్రేక్షకులు అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. నా లైఫ్‌లో రాజకీయం రాంగ్ సెలక్షన్ అని కొందరు అంటున్నారు. కానీ అందులోనూ ఆనందంగా ఉన్నా’’ అన్నారు
సక్సెస్ టూర్
Published Thu, Dec 14 2017 12:21 AM | Last Updated on Thu, Dec 14 2017 12:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment