Saptagiri LLB
-
వజ్రానికి కవచంలా...
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బేబీ శస్త్ర సమర్పణలో శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్, ప్రత్యేక పాటను హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాల తర్వాత నన్ను నేను కొత్తగా ఎలా చూపించుకోగలను అని ఎదురుచూస్తున్న సమయంలో అరుణ్ పవార్ ఈ కథ చెప్పారు. ‘లక్ష్యం గొప్పదైనా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది’ అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నేను హీరోగా కాకుండా మంచి కమెడియన్‌గా ఎంటర్టైన్ చేస్తాను. ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. సినిమాని మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అప్పుడు నోట్ల రద్దు ఉన్నా కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశారు. అంతకంటే మంచి పేరు, డబ్బులు రావాలనే కసితో ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. వజ్రం కోసం సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కథ’’ అన్నారు. ‘‘టైటిల్ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్ బాగా పెరిగింది. నరేంద్ర అన్నగారు ఈ సినిమాకు ఎంతో సహకారం అందించారు. మా సినిమా టీజర్ చూసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు జీవీఎన్ రెడ్డి. నటుడు రాఘవ, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, ఎడిటర్ కిషోర్ మద్దాలి మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
వైజాగ్ సెంటిమెంట్
అల్లిపురం(విశాఖ దక్షిణ): వైజాగ్ సెంటిమెంట్ మాకు బాగా లాభించిందని సప్తగిరి ఎల్ఎల్బీ హీరో సప్తగిరి అన్నారు. తన మొదటి సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సక్సెస్ టూర్ వైజాగ్ నుంచే ప్రారంభించామన్నారు. అదే విధంగా తన రెండో సినిమా సప్తగిరి ఎల్ఎల్బీ విజయోత్సవ యాత్ర కూడా వైజాగ్ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. వైజాగ్ ప్రేక్షకుల ఆశీర్వాదం గొప్పదని, వారి ఆదరణ ఉంటే సక్సెస్ తనంతట అదే వస్తుందన్నారు. సాయి సెల్యులాయిడ్ సినిమాటెక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్యానర్‌పై , డాక్టర్ రవికిరణ్, డైరెక్టర్ చరణ్ లక్కోజుల నిర్మించిన సప్తగిరి ఎల్ఎల్బీ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర బృందం గురువారం జ్యోతి థియేటర్‌కు వచ్చింది. ఈ సందర్బంగా చిత్ర హీరో విలేకరులతో మాట్లాడుతూ మోసం తెలియని రైతుల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాదిగా ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర సంతృప్తి నిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఆయన కోరారు. చిత్ర హీరోయిన్ కౌశిష్ వర మాట్లాడుతూ తను నటించిన చిత్రం విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ తమ మొదటి చిత్రం మాదిరిగానే రెండో చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ నుంచే విజయోత్సవ టూర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఈ టూర్ ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు చరణ్ లక్కోజుల మాట్లాడుతూ చిత్రంలో సప్తగిరి యాక్షన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. -
సక్సెస్ టూర్
సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందని, అందుకే సక్సెస్ టూర్ ప్లాన్ చేశామని చిత్రబృందం పేర్కొంది. ‘‘మా బేనర్లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ని ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఇప్పుడు ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ సినిమాకి ఘనవిజయం అందించారు. అందుకే ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లోని ప్రేక్షకులను ఇవాళ (గురువారం) కలుస్తాం. శుక్రవారం విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో మా సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్స్‌ని సందర్శిస్తాం. ఆంధ్ర టూర్ కంప్లీట్ చేసిన తర్వాత తెలంగాణలో ప్లాన్ చేయనున్నాం’’ అన్నారు నిర్మాత డా. రవికిరణ్. నటుడు, ఎంపీ ఎన్. శివప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భారతీరాజాగారి డైరెక్షన్లో ఓ తమిళ సినిమా చేశా. అక్కడి షూటింగ్ వాతావరణానికి భయపడి, సినిమాలు వద్దనుకున్నా. నూతన ప్రసాద్‌గారి ‘ఓ అమ్మకథ’లో నటించాను. ఆ తర్వాత 5 ఏళ్లలో 56 సినిమాలు చేశా. బేసిగ్గా ఆర్టిస్టుని కాబట్టి ఏడాదికి రెండు సినిమాలైనా డైరెక్ట్ చేయాలని ‘ప్రేమ తపస్సు’ సినిమా స్టార్ట్ చేశా. తర్వాత మరికొన్ని సినిమాలు తీశా. సడన్‌గా పాలిటిక్స్ వైపు లైఫ్ టర్న్ అయ్యింది. అయినప్పటికీ ‘బాలు, డేంజర్, ఆటాడిస్తా, పిల్లజమీందార్’ సినిమాల్లో చేశా. నా నటనకు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ‘సప్తగిరి ఎల్ఎల్బి’లో నేను, సాయికుమార్, సప్తగిరి పోటీపడి నటించాం. ప్రేక్షకులు అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. నా లైఫ్‌లో రాజకీయం రాంగ్ సెలక్షన్ అని కొందరు అంటున్నారు. కానీ అందులోనూ ఆనందంగా ఉన్నా’’ అన్నారు -
ఆ నమ్మకంతోనే సినిమా తీశాం: రవికిరణ్
సప్తగిరి, కశిష్ వోహ్రా జంటగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. గురువారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘రైతులు బతకాలి, అందరికీ న్యాయం దక్కాలన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయం అందించారు. సాయికుమార్, శివప్రసాద్‌లకు దీటుగా సప్తగిరి నటించాడు. మా చరణ్ ఈ సినిమాతో దర్శకునిగా సక్సెస్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సప్తగిరిలో మంచి ఎనర్జీ ఉంది. మా శిష్యుడు చరణ్ ఈ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వర రావు. ‘‘పరుచూరి బ్రదర్స్గారే ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం. నాకు దర్శకుడు చరణ్ గొప్ప సినిమా ఇచ్చారు. ఇది ఆయన విజయం. ఇంత మంచి సినిమాను నాతో చేయించిన నిర్మాత రవికిరణ్‌కి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ కావడంతో పెద్ద డైరెక్టర్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి’’ అన్నారు హీరో సప్తగిరి. ‘‘ కంటెంట్‌ని నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమా తీశాం. రైతులు, లాయర్లు ఎంతోమంది సినిమా చూసి అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు నేచురల్‌గా నటించారు. మంచి సినిమా నిర్మించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రవికిరణ్. ‘‘మాస్ హీరోలో ఉండే క్వాలిటీస్ అన్నీ సప్తగిరిలో ఉన్నాయి. పరుచూరి బ్రదర్స్ మంచి డైలాగ్స్ రాశారు. సినిమా బాగుందని అందరూ అభినందిస్తుంటే పడ్డ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నాను. సాయికుమార్, శివప్రసాద్, సప్తగిరి బాగా నటించారు’’ అన్నారు చరణ్ లక్కాకుల. -
ప్రతి రైతు.. ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా
సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై డా. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రం గురువారం విడుదల కానుంది. ఇందులో కశిస్ వోహ్రా కథానాయిక. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలామంది రచయితలు సప్తగిరి కోసం డిఫరెంట్ కథలు రాస్తారు. రామానాయుడుగారు బతికి ఉంటే చరణ్ లక్కాకులకు చాన్స్ ఇచ్చేవారు. మంచి లీగల్ పాయింట్ ఉన్న సినిమా ఇది. ప్రతి రైతు, ప్రతి లాయర్ చూడాల్సిన సినిమా. చివరి 45 నిమిషాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లు, పాటలను విడుదల చేసిన సెలబ్రిటీలందరికీ థ్యాంక్స్. వారి వల్ల సినిమాకు హైప్ వచ్చింది. సినిమా హిట్ అవుతుందని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు. ‘‘నేను పరుచూరి బ్రదర్స్గారి దగ్గర వర్క్ చేశాను. నా తొలి సినిమాకు వాళ్లు డైలాగ్స్ రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు చరణ్ లక్కాకుల. ‘‘సాయికుమార్‌గారు, శివప్రసాద్‌గారు హీరోలుగా చేసిన ఈ సినిమాలో నేను చిన్న పాత్ర చేసినట్లు అనిపిస్తోంది. పరుచూరి బ్రదర్స్ మా సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతకు రుణపడి ఉంటా’’ అన్నారు సప్తగిరి. -
యువర్ ఆనర్
హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన సప్తగిరి హీరోగా చేసిన తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మంచి విజయం అందుకుంది. ఆ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ సప్తగిరి హీరోగా రెండో చిత్రం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’కి శ్రీకారం చుట్టింది. హిందీ ‘జాలీ ఎల్ఎల్బీ’ తొలి భాగానికి రీమేక్‌గా చరణ్ లక్కాకులను దర్శకత్వంలో డా. రవికిరణ్ నిర్మించనున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డా. రవికిరణ్ కుమార్తెలు బేబీ ఐశ్వర్య, బేబీ అస్మిత కెమెరా స్విచ్చాన్ చెయ్యగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాను మేం ఊహించినదానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ సూపర్‌హిట్ సాధించాలనే పట్టుదలతో ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’’ అన్నారు రవికిరణ్. ‘‘ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అన్నారు దర్శకుడు. షకలక శంకర్, డా. శివప్రసాద్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: సారంగం ఎస్.ఆర్.