అవార్డు గ్రహీతలతో నిర్వహకులు
తమిళసినిమా: అవార్డులు అనేవి ప్రతిభకు గుర్తింపునే కాకుండా వర్తమాన కళాకారులకు ఎంతో ప్రోత్సాహకారంగా నిలుస్తాయి. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయి. ఇక సామాజిక సేవకులకు ఈ అవార్డులు వారి సేవలకు ఫలితంగానూ, గౌరవాన్ని పెంచే విధంగాను ఉంటాయి. అలాంటి ప్రోత్సాహంగా అవార్డుల వేడుకలను అనురాధ జయరామన్‌కు చెందిన మహా ఆర్ట్స్ సంస్థ, కలైమామణి, డాక్టర్ నైల్లె సుందరాజన్‌కు చెందిన యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థ కలిసి చాలా ఏళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం ఆవరణలో ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి జ్ఞానప్రకాశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటి శ్రీవిద్య తదితర కళాకారులతోపాటు, సైకిల్ ఛాంపియన్ డాక్టర్ ఎం ఆర్ సౌందర్య రాజన్, సెన్సార్ బోర్డు సభ్యుడు డాక్టర్ వీకే. వెంకటేశన్ మొదలగు పలువురు సామాజిక సేవకులకు విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం చేతుల మీదగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల కళా, సామాజిక సేవలను విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం అభినందించారు. అలాగే సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment