The Lord of the Rings
-
'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' పార్ట్ 2 తెలుగు ట్రైలర్ విడుదల
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ హాలీవుడ్ చరిత్రలోని అద్భుతాల్లో ఒకటి. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. అలాగే అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా వెబ్ సిరీస్ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ పేరుతో 2022లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అందులో కూడా సత్తా చాటింది. పేరుకే వెబ్ సీరిస్ కానీ, భారీ బడ్జెట్‌తో పార్ట్ 1 తెరకెక్కించారు మేకర్స్. సినిమాటిక్ కోసం ఏమాత్రం విలువలు తగ్గకుండా అమెజాన్ ప్రైమ్ తెరకెక్కించి విడుదల చేసింది. ఇప్పుడు పార్ట్ 2 ఈ ఏడాది ఆగష్టు 29న విడుదల కానుంది. అందుకు సంబంధించిన 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. జేఆర్ఆర్ టోకిన్స్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాల్ని నిర్మిస్తున్నారు.‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ప్రీక్వెల్ కోసం అమెజాన్ రూ. 3250 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ. 1500 కోట్లు కేవలం కథ రైట్స్ కోసమే వెచ్చించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సిరీస్, అంత రిటర్న్స్ తెచ్చుకుంటుందా? సినిమాల్లోలానే టీవీ సిరీస్‌లోనూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' ఆగష్టు 29న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఇందులోని గ్రాఫిక్స్ దృశ్యాలు, పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. శతాబ్దాల కాలం నాటి రాచరిక యుగానికి తీసుకెళ్తున్నట్టుగా ఆకట్టుకునే విధంగా విజువల్స్ ఉన్నాయి. -
మూడువేల కోట్ల బడ్జెట్...
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ హాలీవుడ్ చరిత్రలోని అద్భుతాల్లో ఒకటి. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ను దోచేసుకొని ఇంటికి తీసుకెళ్లాయి. అలాగే అవార్డులను కూడా. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా టీవీ సిరీస్ వస్తోంది. నిజమే. సినిమా కాదు.. టీవీ సిరీస్. గత దశాబ్ద కాలంలో హాలీవుడ్లో టీవీ సిరీస్ బిజినెస్ అమాంతంగా పెరిగిపోవడంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ స్థాయిని కూడా ఎంతంటే అంత పెంచేస్తున్నాయి. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ప్రీక్వెల్ కోసం అమెజాన్ 500 మిలియన్ డాలర్లు (సుమారు మూడువేల రెండొందల యాభై కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తోందట. ఇందులో 250 మిలియన్ డాలర్లు కేవలం కథ రైట్స్ కోసమే వెచ్చించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ టీవీ సిరీస్ ఉంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సిరీస్, అంత రిటర్న్స్ తెచ్చుకుంటుందా? సినిమాల్లోలానే టీవీ సిరీస్‌లోనూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి. -
పౌరోహిత్యం కోసం నటుడికి పదికోట్ల ఆఫర్
తమ పెళ్లికి పౌరోహిత్యం నిర్వహిస్తే.. ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల (రూ. 10 కోట్లు) నజరానా ఇస్తానంటూ ఓ సీనియర్ నటుడిని ఆఫర్ వరించింది. అయితే, ఈ పౌరోహిత్యం ఆషామాషిగా చేయకూడదట. 'లార్డ్ ఆఫ్ రింగ్స్' సినిమా గాండల్ఫ్ పాత్ర మాదిరిగా దుస్తులు వేసుకొని తమ పెళ్లి నిర్వహించాలని ఈ ఆఫర్ ఇచ్చిన వ్యాపారవేత్త కండిషన్ పెట్టాడు. ఈ కండిషన్ ను, ఆఫర్ ను హాలీవుడ్ సీనియర్ నటుడు ఇయాన్ మెక్ కెల్లెన్ (77) నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సినిమాలో ఆయన గాండల్ఫ్ అనే మాంత్రికుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాపారవేత్త, నెప్ స్టర్ స్థాపకుడు సీన్ పార్కర్ వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా జరిగే ఈ పెళ్లిలో గాండల్ఫ్ వేషంలో తనను పాల్గొనాల్సిందిగా ఆఫర్ వచ్చిందని, ఇందుకు 1.5 మిలియన్ డాలర్లు నజరానాగా ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. అయితే, తాను ఈ ఆఫర్ తిరస్కరించానని, మాంత్రికుడైనా గాండల్ఫ్ పెళ్లిళ్లకు పౌరోహిత్యం నిర్వహించడని, అందుకే తనకొచ్చిన ఆఫర్ తిరస్కరించానని ఆయన చమత్కరించారు.