పౌరోహిత్యం కోసం నటుడికి పదికోట్ల ఆఫర్ | McKellen turned 1.5 mn offer to officiate wedding as Gandalf | Sakshi
Sakshi News home page

పౌరోహిత్యం కోసం నటుడికి పదికోట్ల ఆఫర్

Published Tue, Aug 23 2016 9:24 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

పౌరోహిత్యం కోసం నటుడికి పదికోట్ల ఆఫర్

పౌరోహిత్యం కోసం నటుడికి పదికోట్ల ఆఫర్

తమ పెళ్లికి పౌరోహిత్యం నిర్వహిస్తే.. ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల (రూ. 10 కోట్లు) నజరానా ఇస్తానంటూ ఓ సీనియర్ నటుడిని ఆఫర్ వరించింది. అయితే, ఈ పౌరోహిత్యం ఆషామాషిగా చేయకూడదట. 'లార్డ్ ఆఫ్ రింగ్స్' సినిమా గాండల్ఫ్ పాత్ర మాదిరిగా దుస్తులు వేసుకొని తమ పెళ్లి నిర్వహించాలని ఈ ఆఫర్ ఇచ్చిన వ్యాపారవేత్త కండిషన్ పెట్టాడు. ఈ కండిషన్ ను, ఆఫర్ ను హాలీవుడ్ సీనియర్ నటుడు ఇయాన్ మెక్ కెల్లెన్ (77) నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సినిమాలో ఆయన గాండల్ఫ్ అనే మాంత్రికుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో అమెరికా వ్యాపారవేత్త, నెప్ స్టర్ స్థాపకుడు సీన్ పార్కర్ వివాహానికి హాజరుకావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా జరిగే ఈ పెళ్లిలో గాండల్ఫ్ వేషంలో తనను పాల్గొనాల్సిందిగా ఆఫర్ వచ్చిందని, ఇందుకు 1.5 మిలియన్ డాలర్లు నజరానాగా ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. అయితే, తాను ఈ ఆఫర్ తిరస్కరించానని, మాంత్రికుడైనా గాండల్ఫ్ పెళ్లిళ్లకు పౌరోహిత్యం నిర్వహించడని, అందుకే తనకొచ్చిన ఆఫర్ తిరస్కరించానని ఆయన చమత్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement