రూ.10 కోట్లు ఇస్తానన్నా పౌరోహిత్యం చేయనన్నాడు! | No Time To Officiate Weddings As Gandalf: Ian McKellen | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్లు ఇస్తానన్నా పౌరోహిత్యం చేయనన్నాడు!

Published Tue, Aug 23 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

రూ.10 కోట్లు ఇస్తానన్నా పౌరోహిత్యం చేయనన్నాడు!

రూ.10 కోట్లు ఇస్తానన్నా పౌరోహిత్యం చేయనన్నాడు!

న్యూయార్క్: పెళ్లిచేసే పురోహితుడికి సంభావనగా ఎన్ని డబ్బులిస్తాం.. మహా అయితే రూ.10 వేలకు మించవు. కానీ అమెరికాలోని ఓ వ్యాపారవేత్త పురోహితుడికే ఏకంగా రూ.10 కోట్లు ఇస్తానన్నాడట. విచిత్రమేంటంటే అంత డబ్బు ఇస్తానన్నా ఆ పురోహితుడు అంగీకరించలేదట! విషయం ఏంటంటే..

 

హాలీవుడ్ హిట్ సినిమా 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' చూశారుగా, అందులో గాండల్ఫ్ పాత్రధారి, హాలీవుడ్ సీనియర్ నటుడు ఇయాన్ మెక్ కెల్లెన్ (77) మన కథనంలో పురోహితుడు. సరిగ్గా ఆ సినిమాలోని గెటప్ వేసుకుని తన కుమారుడి పెళ్లి తంతు నిర్వహించాలని ఇయాన్ ను కోరాడు న్యూయార్క్ వ్యాపారవేత్త. కానీ ఇయాన్ ఈ కండిషన్ ను, ఆఫర్ ను తిరస్కరించాడు.

 

'అర్రె.. ఎందుకిలా చేశావ్? ఐదు నిమిషాల పెళ్లికి పది కోట్లు మంచి ఆఫరే కదా! ఎందుకు వదులుకున్నావ్?' అని స్నేహితులు అడితే అందుకు ఇయాన్.. 'మాంత్రికుడైన గాండల్ఫ్ శుభకార్యాలైన పెళ్లిళ్లు గట్రాకు పౌరోహిత్యం నిర్వహించడని, అందుకే తనకొచ్చిన ఆఫర్ తిరస్కరించానంటూ చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement