మళ్లీ వస్తున్నాడు లయన్‌ కింగ్‌ | Mufasa: The Lion King First Look Released | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తున్నాడు లయన్‌ కింగ్‌

Published Fri, Apr 5 2024 4:47 AM | Last Updated on Fri, Apr 5 2024 12:38 PM

Mufasa: The Lion King First Look Released - Sakshi

‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ పోస్టర్‌

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ది లయన్‌ కింగ్‌’ (2019) కు ప్రీక్వెల్‌ రానుంది. ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ టైటిల్‌తో రానున్న ఈ ప్రీక్వెల్‌ ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా విడుదల కానుందని సమాచారం. ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాకు జోన్‌ ఫావ్రూ దర్శకత్వం వహించగా, ప్రీక్వెల్‌ను ఆస్కార్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ బార్రీ జెన్కిన్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఇక ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాలో ముఫాసా పాత్ర ఓ దశలో చనిపోతుంది. ముఫాసా కొడుకు సింబా, అతని సోదరుడు, శత్రువు స్కార్‌ల దృష్టి కోణంలో ఈ చిత్రకథ సాగుతుంది.

కానీ ముఫాసా రాజుగా ఎలా ఎదిగాడు? ఆ సమయంలో అతని సోదరుడు స్కార్‌ ఎలాంటి పన్నాగాలు పన్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ సినిమా కథ ఉంటుందని హాలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ‘ది లయన్‌ కింగ్‌’కు రచయితగా చేసిన జెఫ్‌ నాథన్సన్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’కూ వర్క్‌ చేస్తున్నారు. ముఫాసా పాత్రకు ఆరోన్‌ పైర్రీ, స్కార్‌ పాత్రకు కెల్విన్‌ హార్రిసన్‌ వంటివారు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారని హాలీవుడ్‌ టాక్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement