బంగార్రాజు ఈజ్‌ బ్యాక్‌ | Kalyan Krishna on Soggade Chinni Nayana sequel with Nagarjuna | Sakshi
Sakshi News home page

బంగార్రాజు ఈజ్‌ బ్యాక్‌

Published Mon, Jan 21 2019 2:40 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Kalyan Krishna on Soggade Chinni Nayana sequel with Nagarjuna - Sakshi

నాగార్జున

2016 సంక్రాంతికి బంగార్రాజుగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగార్జున ఏ రేంజ్‌లో అల్లరి చేశారో తెలిసిందే. ఇందులోని బంగార్రాజు పాత్రకు ప్రీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నాం అని పలు సందర్భాల్లో నాగార్జున పేర్కొన్నారు కూడా. బంగార్రాజు తిరిగి రావడానికి రంగం సిద్ధం అయింది.  మార్చిలో ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ ప్రీక్వెల్‌కు సంబంధించిన కథను దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ పూర్తి చేశారట. స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి కావచ్చాయట.

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఫస్ట్‌ పార్ట్‌లో నాగార్జున సరసన నటించిన రమ్యకృష్ణ, మిగతా తారాగణమంతా కనిపిస్తారో లేదో వేచి చూడాలి. సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం బంగార్రాజు పాత్రతో పూర్తి కథంటే ‘సోగ్గాడే..’ కంటే రెండింతల ఎనర్జీతో నాగ్‌ కనిపిస్తారని ఊహించవచ్చు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన కల్యాణ్‌ కృష్ణ ప్రీక్వెల్‌ని మరింత ఎంటర్‌టైనింగ్‌గా ప్లాన్‌ చేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement