Payal Rajput First Look From Ginna Movie Is Out Now, See Inside - Sakshi
Sakshi News home page

Payal Rajput: 'పచ్చళ్ల స్వాతి'గా పాయల్ రాజ్ పుత్ లుక్‌ చూశారా?

Published Mon, Aug 8 2022 1:22 PM | Last Updated on Mon, Aug 8 2022 3:29 PM

Payal Rajput First Look From Ginna Movie Is Out Now - Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ఇషాన్‌ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటించనుంది. ఈ సినిమాలో ఆమె పచ్చళ్ల స్వాత్రి అనే పాత్రలో కనిపించనుంది.

ఈ విషయాన్ని స్వయంగా పాయల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం తిరుపతిలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఏవీఏ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అనూప్ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement