
నరేష్ శవాన్ని కాల్చిన చోటుకి నిందితులు..
ఆత్మకూరు(యాదాద్రిభువనగిరి): యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లిలో జరిగిన నరేష్ హత్య కేసులో నిందితులను ఎల్బీనగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భువనగిరి జైలు నుంచి నిందితులైన శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డిలను నరేష్ ను చంపి కాల్చివేసిన ప్రదేశానికి తీసుకెళ్లారు.
ముందు జాగ్రత్తగా మీడియాను దగ్గరకు రానివ్వకుండా చేసిన పోలీసులు.. శవాన్ని కాల్చిన చోట మట్టిని సేకరించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని క్లూస్ టీం బృందం నిందితుల నుంచి వివరాలు రాబట్టింది. కులాంతర వివాహం కారణంగా చోటు చేసుకున్న ఈ హత్య కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.