
స్వాతి అంటే చాలా ఇష్టం
ప్రేమజంటలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు కనిపించడం లేదు. నరేష్ - స్వాతి జంట గురించిన ఈ విషయం గత కొన్ని రోజులుగా సెన్సేషన్‌గా మారింది. అయితే, అదృశ్యం కావడానికి రెండు రోజుల ముందు నరేష్ తన తల్లిదండ్రులకు ఓ లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
స్వాతి అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే తనతో కలిసి దూరంగా వెళ్లి బతకాలనుకుంటున్నానని అందులో నరేష్ చెప్పాడు. స్వాతిని విడిచిపెట్టి తాను ఉండలేనని, ఆమె సొంత తల్లిదండ్రులను విడిచి తన కోసం వచ్చిందని, ఆమెను మోసం చేయలేనని రాశాడు. స్వాతిని తిరిగి వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. తనను క్షమించాలని తల్లిదండ్రులను ఆ లేఖలో నరేష్ కోరాడు.