ఓ కొత్త ప్రయత్నం ఇది!
ఓ కొత్త ప్రయత్నం ఇది!
Published Sat, Mar 8 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
‘‘తెలుగులో వచ్చిన ఓ కొత్త ప్రయత్నం ‘బంగారు కోడిపెట్ట’. ఈ సినిమాను ఆదరిస్తే... ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి అన్నారు. నవదీప్, స్వాతి జంటగా రాజ్ పిప్పళ్ల దర్శకత్వంలో సునీత తాటి నిర్మించిన చిత్రం ‘బంగారు కోడిపెట్ట’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ -‘‘నవదీప్ నటన బావుందని అందరూ అంటున్నారు. తన కెరీర్‌కి మంచి మలుపు ఈ సినిమా. ఇటీవలే థియేటర్‌లో సినిమా చూశాను. చాలా మంచి స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ‘‘ ‘బంగారు కోడిపెట్ట’కు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. తన రెండో సినిమాతోనే విచిత్రమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేశాడు దర్శకుడు రాజ్ పిప్పళ్ల. ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు అందుతున్నాయి’’ అని నవదీప్ చెప్పారు. 42 రోజుల్లో సినిమా పూర్తి చేశామని, భిన్నంగా ఉందని అందరూ అభినందిస్తున్నారని నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు. వాణిజ్య విలువలు, కొత్తదనం రెండూ కలిస్తే తమ ‘బంగారు కోడిపెట్ట’ ’’ అని దర్శకుడు పేర్కొన్నారు.
Advertisement
Advertisement