లవ్ చేయండి లైఫ్ బాగుంటుంది | Actor Navdeep come back to Tamil Cinema | Sakshi
Sakshi News home page

లవ్ చేయండి లైఫ్ బాగుంటుంది

Jul 10 2014 11:54 PM | Updated on Sep 2 2017 10:06 AM

లవ్ చేయండి లైఫ్ బాగుంటుంది

లవ్ చేయండి లైఫ్ బాగుంటుంది

ఈతరం యువతకు నచ్చే ఇలాంటి టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం లవ్ పన్నుంగ లైఫ్ నల్లారుక్కుం. విశేషం ఏమిటంటే టాలీవుడ్ యువ జంట నవదీప్, స్వాతి జంటగా

ఈతరం యువతకు నచ్చే ఇలాంటి టైటిల్‌తో రూపొందుతున్న చిత్రం లవ్ పన్నుంగ లైఫ్ నల్లారుక్కుం. విశేషం ఏమిటంటే టాలీవుడ్ యువ జంట నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ఇది. నవదీ, అరిందుమ్ అరియామలుమ్ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు సుపరిచిత హీరోనే, అలాగే స్వాతి సుబ్రమణ్యపురం, వడకరి తదితర చిత్రాలతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జోడీ నటిస్తున్న లవ్ పన్నుంగ లైఫ్ నల్లారుక్కుమ్ (లవ్ చెయ్యండి లైఫ్ బాగుంటుంది) చిత్రాన్ని ఆర్ పీ ఫిలింస్ పతాకంపై నిర్మాత ఆర్.పి బాలా నిర్మిస్తున్నారు.
 
 కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న రాజ్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది యూత్‌ఫుల్ లవ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం అని తెలిపారు. చిన్న కథ, ఆసక్తిని రేకెత్తించే కథనాలతో ప్రేక్షకులను సంతృప్తి పరచవచ్చని ఈతరం దర్శకులు నిరూపిస్తున్నారు. ఆ బాణిలో ఈ లవ్ పన్నుంగ లైఫ్ నల్లారుక్కుమ్ చిత్రం ఉంటుందన్నారు. ఒక్క నేపథ్యం మూడు కథలుగా ఈ చిత్రం ఉంటుందని వెల్లడించారు. చిత్రం కోసం గాయకుడు గానా బాలా రాసిన పాడిన వాడా మచ్చాన్ కిల్లాడి, వందు నిల్లు మున్నాడి అనే పాటను ఇటీవలే రికార్డు చేసినట్లు చెప్పారు. ఆడియో విడుదలైన తరువాత ఈ పాట తమిళనాడులో ప్రతి వీధిలోను మారుమోగుతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement